నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ మహిళ ఎమ్మెల్యేగా గెలిచి సరికొత్త రికార్డు నెలకొల్పింది. నాగాలాండ్ రాష్ట్ర హోదా పొందినా 60 ఏళ్ల తర్వాత ఓ మహిళా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కాలు మోపనున్నారు. బీజేపీ మిత్రపక్షం ఎన్‌డిపిపికి చెందిన హెకానీ జఖాలు దిమాపూర్ స్థానం నుంచి గెలుపొంది నాగాలాండ్ అసెంబ్లీలో సరికొత్త చరిత్ర సృష్టించారు.
48 ఏళ్ల న్యాయవాది, సామాజిక కార్యకర్త అయిన హెకానీ జఖాలు లోక్ జనశక్తి పార్టీకి చెందిన అజితో జిమోమిని ఓడించారు. ఎన్‌డిపిపి అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆమె.. దిమాపుర్ స్థానం నుంచి 1,536 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 1963లో నాగాలాండ్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా లభించినప్పటి నుండి ఆ రాష్ట్రంలో 13 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కానీ, ఇప్పటివరకు ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టిన దాఖలాలు లేవు. తాజాగా హెకానీ ఎమ్మెల్మేగా గెలిచి సరికొత్త రికార్డు నెలకొల్పోంది.
ఇది ఇలా ఉండగా.. ఈశాన్య రాష్ట్రాల ఫలితాలు వెలువడుతున్నాయి. త్రిపుర, నాగాలాండ్ అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ గాలి వీచింది. త్రిపుర, నాగాలాండ్‌లో బీజేపీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. మేఘాలయలో ఏ పార్టీకి సృష్టమైన మోజారీటి రాలేదు. ఎన్పీపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో అక్కడ మాత్రం హంగ్ ఏర్పడింది.