ఎప్పుడో వచ్చిన 'పందెంకోడి' సినిమాకు కొన్నాళ్ల కిందట సీక్వెల్ తో వచ్చాడు విశాల్. పందెంకోడి-2 పేరుతో వచ్చిన ఆ సినిమా అంతగా ఆడలేదు. పాత మ్యాజిక్ ను విశాల్ –లింగుస్వామిలు రీ క్రియేట్ చేయలేకపోయారు.
అయితే ఇప్పుడు మరో సీక్వెల్ తో వస్తున్నాడు విశాల్. 'డిటెక్టివ్ పార్ట్ టు' రాబోతోంది. తమిళంలో రూపొందిన ఈ సినిమా తెలుగులో కూడా బానే ఆడింది. డిటెక్టివ్ సినిమాలకు సీక్వెల్స్ రాసుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు.
పూర్తిగా వేరే కథా,కథనాలతో .. డిటెక్టివ్ సినిమాలను రూపొందించుకునే అవకాశాలుంటాయి. ఆ అవకాశాన్నే విశాల్, డిటెక్టివ్ పార్ట్ టు రూపకర్తలు ఉపయోగించుకుంటున్నట్టుగా ఉన్నారు. షెర్లాక్ హోమ్స్ సినిమాల స్ఫూర్తితో డిటెక్టివ్ ఫస్ట్ పార్ట్ వచ్చింది. ఆకట్టుకుంది. ఇక రెండో పార్ట్ ఏ మేరకు ఆకట్టుకుంటుందో!