Advertisement

Advertisement

indiaclicks

Home > Politics - Gossip

చంద్రబాబుతో పవన్ కూర్చుంటాడా?

చంద్రబాబుతో పవన్ కూర్చుంటాడా?

రాష్ట్రంలో ఇసుక సమస్య తీరిపోతున్నది. ఇసుక తవ్వకాలకు వెసులుబాటు ఏర్పడుతున్న కొద్దీ.. రోజువారీ తవ్వకాలు పెరుగుతున్నాయి. మరికొన్ని రోజులు గడిస్తే.. కొరత అనేది అసలు కనిపించదు. ఈలోగానే రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని విపక్ష కూటములు ప్రయత్నిస్తున్నాయి.

చంద్రబాబునాయుడు 14వ తేదీనాటికి 12 గంటల నిరాహార దీక్ష చేయాలని అనుకుంటున్నారు. ఆ దీక్షలో కూచోవాల్సిందిగా పవన్ కల్యాణ్ ను కూడా ఆహ్వానిస్తున్నట్లు సమాచారం.

రాష్ట్రంలో అంతో ఇంతో బలపడుతున్న భారతీయ జనతా పార్టీ.. అటు తెలుగుదేశాన్ని గానీ, ఇటు జనసేనను గానీ.. ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అస్సలు ఖాతరు చేయడం లేదు.

పవన్ కల్యాణ్ పదేపదే తనకు మోడీ చాలా క్లోజ్ అని చెప్పుకుంటూ ఉంటారు గానీ.. ఆయన ఓపెన్ గా తన లాంగ్ మార్చ్ కు మద్దతివ్వాల్సిందిగా పిలుపునిస్తే.. తాము ఆ దీక్షకు మద్దతిచ్చే ప్రసక్తే లేదని భాజపా తెగేసి చెప్పింది. తెలుగుదేశం పార్టీని వారు ఎటూ శత్రువులాగానే చూస్తున్నారు.

ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబునాయుడు మాత్రం.. పవన్ లాంగ్ మార్చ్ కు తమ పార్టీ తరఫున మద్దతు ప్రకటించారు. తన జమానాలో మంత్రులుగా పనిచేసిన వారిని కూడా ఆ కార్యక్రమానికి పంపారు. తమ మద్దతు లేకపోతే.. తమ పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొనకుండా ఉన్నట్లయితే.. అసలు లాంగ్ మార్చ్ విజయవంతం అయి ఉండేదే కాదని.. తెలుగుదేశం వారు భావిస్తున్నారు.

ఇలాంటి నేపథ్యంలో... చంద్రబాబు చేయబోతున్న దీక్షకు కూడా భారీగానే జనసమీకరణ చేస్తున్నారు. దానికి మరింత హైప్ క్రియేట్ చేయడానికి దీక్షలో పాల్గొనాల్సిందిగా పవన్ కల్యాణ్ ను కూడా ఆహ్వానిస్తున్నట్లు సమాచారం.

ఈ రెండు పార్టీలకు ఇప్పుడు ‘ఒకరికి ఒకరు’ తప్ప వేరే గతిలేదు. యూ స్క్రాచ్ మై బ్యాక్.. ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్ సామెత తరహాలో.. నాకు నువ్వు మద్దతివ్వు, నీకు నేను మద్దతిస్తా అన్నట్లుగా వాళ్లు అంటకాగాల్సిందే.

అన్ని పార్టీల మద్దతు కోసం తెదేపా నిర్వహించిన సమావేశానికి జనసేన ప్రతినిధి కూడా వెళ్లారు. అయితే ఆ పార్టీలో ఊరూపేరూ లేని నాయకులు వస్తే తమ దీక్షకు మైలేజీ ఏమీ ఉండదని.. పవన్ స్వయంగా రావాలని తెదేపా కోరుతున్నట్లు సమాచారం.

అయితే పవన్ లేదంటే నాదెండ్ల మనోహర్... వారిద్దరు తప్ప.. కాస్త ఇమేజి ఉండి చంద్రబాబు దీక్షకు హాజరు కాదగిన నాయకులే జనసేనలో లేరు పాపం. తమ సంపూర్ణ మద్దతు కనిపించేలా చేయడానికి ఇప్పుడు పవన్ హాజరవుతారా? ఆయన ఒప్పుకోకపోతే.. ఎవరు హాజరౌతారో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?