మెగాస్టార్ చిరంజీవి సినిమా స్టార్ట్ కావడానికి ఇంకాస్త సమయం పట్టేలా వుంది. భోళాశంకర్ సినిమా తరువాత ఆయన తన మోకాలికి సర్జరీ చేయించుకున్నారు. అందువల్ల ప్రస్తుతం విశ్రాంతి మోడ్ లో వున్నారు.
కర్ర సాయంతో ఇంట్లోనే నడుస్తున్నారని తెలుస్తోంది. అందువల్లే బయటకు ఎక్కడికీ రావడం లేదు. ఎఎన్నార్ ఫంక్షన్ కూడా తను రాలేకనే, రామ్ చరణ్ ను పంపించారు. కాలి సర్జరీ కి సంబంధించి ఇంకా మిగిలిన పనులు కూడా వున్నాయని తెలుస్తోంది.
వాకింగ్ ప్రాక్టీస్, ఫిజియో ధెరపీ లాంటివి వుంటాయట. అవన్నీ చేసుకుని నవంబర్ కు సినిమా షూట్ కు రెడీ కావాలని ప్రయత్నిస్తున్నారు. అంటే కనీసం ఇంకో నెలన్నర సమయం పట్టొచ్చు. ప్రస్తుతానికి ముందుగా చేయాలని అనుకున్న కళ్యాణ్ కృష్ణ సినిమాకు పాజ్ బటన్ నొక్కారు. దాని తరువాత చేయాలనుకున్న యువి సినిమాను ముందుకు తెచ్చారు. అనుష్క ను ఆల్ మోస్ట్ హీరోయిన్ గా ఫైనల్ చేసారు. కానీ ఆమెకు ఓ మలయాళ సినిమా వుంది. దాంతో డేట్ లు క్లాష్ అవుతున్నాయని తెలుస్తోంది.
మెగాస్టార్ అంటే డ్యాన్స్ లు, ఫైట్లు కూడా తప్పవు. ఈ వయస్సులో, సర్జరీ చేయించుకున్న తరువాత అవన్నీ చేయాలంటే వీలయినంత విశ్రాంతి తీసుకుని రెడీ కావాల్సి వుంటుంది.