బాబా పి.ఆర్ దర్శకత్వంలో సూర్య, విషిక జంటగా నటచిన తాజా చిత్రం అష్టదిగ్బంధనం. ఎం.కె.ఎ.కె.ఎ ఫిల్మ్ ప్రరడక్షన్ పై మనోజ్ కుమార్ అగర్వాల్ నిర్మాణంలో వొస్తున్న ఈ చిత్రం ఈనెల 22న సినిమా పరరక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అష్టదిగ్బంధనం దర్శక, నిర్మాతలు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా దర్శకుడు బాబా పి.ఆర్. మట్లాడారు.
ఈ సందర్భంగా దర్శకుడు బాబా పి.ఆర్. మాట్లాడుతూ …
అష్టదిగ్బంధనం అనేది చాలా పవర్ఫుల్ టైటీల్. ఈ సినిమాలో దానిన జస్టిఫై చేసరలా పరతి అంశంలో జాగ్రత్తలు తీసుకున్నాం. టైటిల్‌కు తగ్గట్టుగానే ఇందులోని ప్రతి కారెక్టెర్ అవతలీ వాళ్ళని అష్టదిగ్బంధనం చేయాలని చూస్తుంటారు. ఇలా పలువురు వ్యక్తుల స్వార్ధంతో కూడిన జీవితాలకు సంబంధించినదే ఈ కథ.
ఇది యాక్షన్ థ్రిల్లర్ ఎక్కువగా ఇష్టపడే వారికి బాగా కనెక్ట్ అవుతుంది. అలాగని ఇతర వర్గాల ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకోలేదని కాదు. అన్నీ వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా. మొదటి ట్రైలర్ లో కొంత యాక్షన్ పార్ట్ ఎక్కువగా చూపించటం వల్ల మీకు హింస ఎక్కువ అనిపిస్తుంది. రెండవ ట్రైలర్ లో అందరిని ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. మంచి రెస్పాన్స్ వచ్చింది.
నా తొలి చిత్రం 'సైదులు' అయినా… ఈ 'అష్టదిగ్బంధనం' అయినా, కథను నమ్మే చేసాను. ఒక టెక్నీషియన్ గా ఈ రెండు సినిమాలకే కాదు.. భవిష్యత్తులో నేను చేయబోయే సినిమాలకి కూడా ఒకే విధంగ కష్టపడతాను.
కధలో విషయం ఉంటే, ఆర్టిస్టులు ఆటోమేటిక్ గా పెర్ఫార్మ్ చేస్తారు. ఇందులో కూడా కొత్తవారుఅయిన ఆర్టిస్ట్స్ అందరు ఎక్సపీరియెన్స్డ్ గా కనిపిస్తారు
సంగీత దర్శకుడు జాకసన్ విజయన్ మలయాళ చిత్రాలలో ఎంత మంచి టెక్నీషియనో అందరికి తెలిసిందే. మఖ్యంగా ఆయన తాజా సూపర్ హిట్ ‘ట్రాన్స్’ ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలుసు. ఈ సినిమా లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్యం. అందుకే ఆయనని యెంచుకున్నాం. వెరీ నైస్ పర్సన్. ఇందులో మూడు పాటలు ఉంటాయి వాటికి కూడా ఆయన మంచి సంగీతం ఇచ్చారు.
మా నిర్మాత మనోజ్ కుమార్ అగర్వాల్ గారు బిజినెస్ మాన్. సినిమాల మీద కూడా ఇంటరెస్ట్ వుంది. ఈ కథ చెప్పగానే బాగా ఇంప్రెస్స్ అయ్యారు. కథ కోసం నేను ఏది అడిగితే అది ఆరెంజ్ చేశారు. ఫైనల్ అవుట్ ఫుట్ చూసి చాలా హ్యయపీగా ఫీల్ అయ్యారు.
నిర్మాత మనోజ్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ …
ఇది స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా. ఈ కథను వినగానే చాలా ఎక్సయిట్ ఫీలయ్యా. ఇలాంటి కథతో నిర్మాతగా మారుతున్నందుకు చాలా హ్యాపీగ ఉంది. ప్రేక్షకులను ‘అష్టదిగ్బంధనం’ చేసే కథ, కథనాలు సినిమా హైలైట్.
ముందే ఈ సినిమాకు బడ్జెట్ ఎంత అనేది ఫిక్స్ అయ్యాం. దాన్ని బట్టి ముందుకు వెళ్ళాం. ఎక్కడా ఓవర్ బడ్జెట్ అవ్వలేదు. బేసిక్ గా నేను వ్యారస్తుడిని. ముందు అయితే ఇది కూడా ఒక వ్యాపారం అనే భావనతోనే దిగాను. ఆ తర్వాత ఇది 24 క్రాఫ్ట్స్ తో కూడిన కళాకారుల క్రియేటివిటీ కి దర్పణం అని అర్ధం అయ్యింది. అక్కడ నుంచి దీన్ని కళాత్మక వ్యాపారంగానే చూడటం మొదలు పెట్టాను.
కేవలం కథ మీద వున్నా నమ్మకమే నన్ను ముందుకు నడిపింది. సినిమాను సినిమాగా తీస్తే త్పపకుండా పరక్షకులు ఆదరిస్తారు. వారికి కావలసిన అన్ని అంశాలు జాగ్రత్త గా ఇమడ్చగలిగితే కచ్చితంగా సక్సెస్ వొస్తుంది. దర్శకుడు బాబా గారు ముందు చెప్పిన దానికన్నా అద్భుతంగా తీశారు.
ఇందులో ప్రేక్షకులను అష్టదిగ్బంధనం చేసే అంశాలు చాలానే వున్నాయి. మంచి సస్పెన్స్, పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్, ఫోటోగ్రఫీ ఇలా ప్రతి విషయం లోను చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. అవే సినిమాను సక్సెస్ చేస్తాయి అని నా నమ్మకం.
రెస్పాన్స్ చాలా బాగుంది. ఆంధ్ర, తెలంగాణలో దాదాపు 150 నుంచి 200 థియేటర్స్ లో విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం ఒక సినిమా సెట్స్ మీద వుంది. త్వరలో దాని వివరాలు తెలియజేస్తాం.
నేను ప్రేక్షకులకు చెప్పేది ఒక్కటే. ఈ రోజు (సెప్టెంబర్ 22న) మీరు థియేటర్స్ కు వొచ్చి సినిమా చూడండి. మీరు కొన్న టికెట్ రేట్ కు మరింత సంతృప్తిని ఇస్తుంది.