బిగ్‌బాస్ హౌస్ నుంచి ఊస‌ర‌వెల్లి బయ‌ట‌కు…

బిగ్‌బాస్ సీజ‌న్‌-5లో హౌస్ నుంచి విశ్వ ఎలిమినేట్ కావ‌డం ఆయ‌న అభిమానుల‌కు షాక్ ఇచ్చింది. టాస్క్‌ల్లో అద్భుతంగా ఆడుతూ, త‌న ప‌నేంటో చేసుకెళ్లే విశ్వకు త‌గిన ఆద‌ర‌ణ ల‌భించ‌లేదు.  Advertisement ఇది తోటి కంటెస్టెంట్ల‌కు…

బిగ్‌బాస్ సీజ‌న్‌-5లో హౌస్ నుంచి విశ్వ ఎలిమినేట్ కావ‌డం ఆయ‌న అభిమానుల‌కు షాక్ ఇచ్చింది. టాస్క్‌ల్లో అద్భుతంగా ఆడుతూ, త‌న ప‌నేంటో చేసుకెళ్లే విశ్వకు త‌గిన ఆద‌ర‌ణ ల‌భించ‌లేదు. 

ఇది తోటి కంటెస్టెంట్ల‌కు కూడా ఆశ్చ‌ర్యం క‌లిగించింది. కానీ విశ్వ ఎలిమినేష‌న్‌పై మ‌రో కంటెస్టెంట్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం హాట్ టాపిక్ అయ్యింది.

విశ్వ ఎలిమినేట్ కావ‌డంపై నాలుగో వారంలో బ‌య‌టికొచ్చిన న‌ట‌రాజ్ మాస్ట‌ర్ తీవ్రంగా స్పందించాడు. 'అందరికీ సూపర్‌ ఎగ్జయిట్‌మెంట్‌ ఉన్న వార్త.. హౌస్‌లో నుంచి ఊసరవెల్లి బయటకు వచ్చేసింది. ఎందుకంటే అది చేసిన పాపాలు పండాయి కాబట్టే ఇలా జరిగింది' అని వ్యంగ్యంగా మాట్లాడాడు. ఈ మేర‌కు ఆయ‌న ఓ వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో వైర‌ల్ అవుతోంది.

హౌస్‌లో ఉన్న‌ప్పుడు న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌, విశ్వ‌కు మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో గొడ‌వ జ‌ర‌గ‌డాన్ని నెటిజ‌న్లు గుర్తు చేస్తున్నారు. అందుకే ఇప్పుడు న‌ట‌రాజ్ ఈ స్థాయిలో రియాక్ట్ అయ్యాడ‌నే అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు. కానీ న‌ట‌రాజ్ కామెంట్స్‌పై మెజార్టీ నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.  

'నువ్వేం పాపాలు చేసి వుంటే నాలుగో వారంలోనే ఎలిమినేట్ అయ్యావో చెప్పు ఊస‌ర‌వెల్లి' అని కొంద‌రు ప్ర‌శ్నిస్తే కామెంట్స్ పెట్ట‌డం గ‌మ‌నార్హం.  'నీ సోది జంతువులకు చెప్పుకోపో' అంటూ మ‌రికొంద‌రు ఘాటు వ్యాఖ్య‌లు చేస్తుండడాన్ని గ‌మ‌నించొచ్చు.