మళ్లీ సొంతంగా సినిమా తీస్తానంటున్న హీరో

హీరో విశ్వక్ సేన్ మరోసారి తన సొంత సినిమాను ఎనౌన్స్ చేశాడు. స్వీయ దర్శకత్వంలో వచ్చే ఏడాది సినిమా ఉంటుందని ప్రకటించాడు. ఈసారి కూడా పక్కా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ తోనే సినిమా డైరక్ట్…

హీరో విశ్వక్ సేన్ మరోసారి తన సొంత సినిమాను ఎనౌన్స్ చేశాడు. స్వీయ దర్శకత్వంలో వచ్చే ఏడాది సినిమా ఉంటుందని ప్రకటించాడు. ఈసారి కూడా పక్కా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ తోనే సినిమా డైరక్ట్ చేస్తానంటున్నాడు ఈ హీరో.

“వచ్చే ఏడాది నా దర్శకత్వంలో సినిమా ఉంటుంది. ప్రస్తుతం రైటింగ్ లో ఉన్నాను. హైదరాబాద్ కుర్రాడు, హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ తోనే సినిమా ఉంటుంది. ఈసారి తెలుగు, హిందీ భాషల్లో సినిమా చేయబోతున్నాను. చాన్నాళ్ల తర్వాత మళ్లీ డైరక్ట్ చేయబోతున్నాను.”

ఇంతకుముందు ఫలక్ నుమా దాస్ అనే సినిమా చేశాడు విశ్వక్ సేన్. ఆ సినిమాకు అన్నీ తానై వ్యవహరించాడు. అయితే అది రీమేక్. ఈసారి మాత్రం ఒరిజినల్ స్టోరీతో మెగాఫోన్ పట్టుకుంటానంటున్నాడు విశ్వక్.

గతంలో సినిమా అవకాశాల కోసం చాలా ప్రయత్నించానని, ఎవ్వరూ ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదన్న విశ్వక్ సేన్.. ఆ ఫ్రస్ట్రేషన్ తోనే తను సొంతంగా సినిమా డైరక్ట్ చేసి నిర్మించానని చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం విశ్వక్ కు చేతినిండా సినిమాలున్నాయి. అయినప్పటికీ మరోసారి సొంత డైరక్షన్ లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.

అతడు నటించిన పాగల్ సినిమా విడుదలకు సిద్ధమైంది. నివేత పెతురాజ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కచ్చితంగా థియేటర్లకు కళ తెస్తుందంటున్నాడు విశ్వక్.