సోషల్ మీడియాకు బానిసైంది. ఏకంగా 50 మంది బాయ్ ఫ్రెండ్స్ ను మెయింటైన్ చేసింది. కొందరితో అక్రమ సంబంధం కూడా పెట్టుకుంది. భర్తకు విషయం తెలిసిపోయింది. దీంతో ఓ బాయ్ ఫ్రెండ్ తో కలిసి కట్టుకున్న భర్తనే హత్య చేసింది ఓ ఇల్లాలు. తమిళనాడులో జరిగింది ఈ ఘటన.
తమిళనాడులోని సేలంలో షాలినీ, ప్రభుదేవాకు పెళ్లయింది. షాలినీ వయసు జస్ట్ 22 ఏళ్లు. తనకంటే 17 ఏళ్లు పెద్దవాడితో పెళ్లి జరిపించడంతో ఎప్పుడు బాధపడుతూ ఉండేది. కానీ ప్రభుదేవా మాత్రం షాలినీని బాగానే చూసుకున్నాడు. అయితే ఓవైపు పెళ్లయినప్పటికీ, మరోవైపు షాలినీ మాత్రం తన బాయ్ ఫ్రెండ్స్ ను మరిచిపోలేదు.
నిత్యం సోషల్ మీడియాలో బాయ్ ఫ్రెండ్స్ తో టచ్ లో ఉండేది. మరోవైపు అదే ప్రాంతానికి చెందిన సెల్వరాజ్ తో కూడా అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసి మందలించాడు భర్త. అయినప్పటికీ షాలినీ తన వ్యవహార శైలి మార్చుకోలేదు.
ఓసారి భర్త లేని సమయంలో సెల్వరాజ్ ను ఇంటికి పిలిపించుకుంది షాలినీ. ఇద్దరూ ఏకాంతంగా ఉంటున్న టైమ్ లో భర్త ప్రభుదేవా ఇద్దర్నీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. గట్టిగా మందలించాడు. దీంతో భర్తపై కోపం పెంచుకుంది షాలినీ. ప్రియుడు సెల్వరాజ్ తో కలిసి అతడ్ని హత్య చేసింది.
హత్య తర్వాత తనే పోలీసులకు ఫిర్యాదు చేసి, గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి భర్తను హత్య చేశారంటూ అబద్ధం చెప్పింది. కేసును లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు అసలు విషయాన్ని పసిగట్టారు. షాలినీతో పాటు, సెల్వరాజ్ ను అదుపులోకి తీసుకున్నారు.
షాలినీకి 50 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలుసుకున్న పోలీసులు అవాక్కయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె బాయ్ ఫ్రెండ్స్ అంతా తమ సెల్ ఫోన్స్ స్విచాఫ్ చేసేశారు.