Advertisement

Advertisement


Home > Movies - Movie News

మా సినిమాను కూడా పెద్ద మనుషులు చూడండి

మా సినిమాను కూడా పెద్ద మనుషులు చూడండి

గత వారం గామి, భీమ, ప్రేమలు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో ప్రేమలు సినిమాకు భారీగా ప్రచారం చేస్తున్నారు. స్వయంగా మహేష్ బాబు రంగంలోకి దిగి, ప్రేమలు సినిమా చాలా బాగుందని మెచ్చుకున్నాడు. మరోవైపు స్టార్ డైరక్టర్ రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి లాంటి ప్రముఖులు కూడా ప్రేమలు సినిమాపై మాట్లాడారు.

అయితే గామి సినిమాపై ఇప్పటివరకు ఎవ్వరూ స్పందించలేదు. టాలీవుడ్ ప్రముఖులెవ్వరూ ఈ సినిమాపై మాట్లాడలేదు. ఇదే అంశంపై విశ్వక్ సేన్ స్పందించాడు. తన సినిమాను కూడా పెద్ద మనుషులు చూడాలని కోరాడు.

"కొత్త కథలతో మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఎవరైనా నలుగురు పెద్ద మనుషులు మా గామి సినిమా కూడా చూసి మాట్లాడితే బాగుంటుంది. ఇంతకుముందు తెలుగులో ఇలాంటి సినిమా రాలేదు. కాబట్టి టాలీవుడ్ పెద్దలు ఎవరైనా మా సినిమా గురించి మాట్లాడితే బాగుంటుంది."

ఎవ్వరికి నచ్చినా, నచ్చకపోయినా గామి సినిమా మాత్రం ఇక్కడితో ఆగదంటున్నాడు విశ్వక్. అదే హాలీవుడ్ సినిమా అయితే ఈపాటికి చాలామంది బట్టలు చింపేసుకునేవాళ్లని విమర్శించాడు.

"గామి ఇక్కడితో ఆగదు. 20 ఏళ్ల తర్వాత కూడా గామి చూసి గర్వపడతారు. మేం ఏ ఉద్దేశంతో ఈ సినిమా తీశామో అర్థం చేసుకోండి. ఎందుకు ఇంతమందికి నచ్చిందో ఆలోచించండి. అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి. దయచేసి సినిమా చూసి ఎందుకు నచ్చిందో చెప్పండి. ఇదే హాలీవుడ్ సినిమా డూన్ అయితే ఈపాటికి బట్టలు చింపేసుకొని చూసేవాళ్లం."

గామి సినిమా చూసి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారనే విషయం తన దృష్టికి వచ్చిందన్నాడు విశ్వక్. ఈ సినిమాలో రాకెట్ సైన్స్ లేదని, కొంచెం ఏకాగ్రతతో సినిమా చూస్తే ఈజీగానే అర్థమౌతుందని చెబుతున్నాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?