నన్ను ఎవ్వడూ ఏం పీకలేడు – విశ్వక్ సేన్

హీరో విశ్వక్ సేన్ మరోసారి తన మాటలకు పదును పెట్టాడు. టీవీ9 చర్చావేదికలో తనకు జరిగిన అవమనాన్ని, ఆ తర్వాత టీవీ9 తనపై చేస్తున్న యాగీని పరోక్షంగా గుర్తుచేస్తూ.. “నన్ను ఎవ్వడూ ఏం పీకలేడు”…

హీరో విశ్వక్ సేన్ మరోసారి తన మాటలకు పదును పెట్టాడు. టీవీ9 చర్చావేదికలో తనకు జరిగిన అవమనాన్ని, ఆ తర్వాత టీవీ9 తనపై చేస్తున్న యాగీని పరోక్షంగా గుర్తుచేస్తూ.. “నన్ను ఎవ్వడూ ఏం పీకలేడు” అంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఇలాంటిది చాలా చూశానంటూ చెప్పుకొచ్చాడు.

“నాకు ఏదో జరిగిందని, నన్ను ఎవడో ఏదో అన్నాడని నేను ఎప్పుడూ బాధపడను. నేను బాధపడేది ఒక్కటే. నాక్కూడా ఫ్యామిలీ ఉంది. ఇంట్లో అమ్మా, నాన్న, అక్క ఉన్నారు. నా ఫ్యామిలీ బాధపడుతుందనే ఆలోచన ఎందుకు చేయరు. నేను మా అమ్మకు మాత్రమే జవాబుదారీ. అమ్మా.. నీ కొడుక్కి ఏం కాదు, ఎవ్వడూ నన్ను ఏం పీకలేడు.”

ఇలా తన అభిప్రాయాన్ని మరోసారి బయటపెట్టాడు విశ్వక్. అమ్మాయిలకు తను గౌరవం ఇవ్వనంటూ జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టిన ఈ నటుడు.. అమ్మ తనకు సంస్కారం నేర్పించిందని, అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో తనకు తెలుసని అన్నాడు. నిజంగా అమ్మాయిలకు గౌరవం ఇవ్వకపోతే నిన్న జరిగిన ఘటనల్లో తను సైలెంట్ గా ఉండేవాడ్ని కాదని చెప్పుకొచ్చాడు.

“నేను ఈగ లాంటోడ్ని. నలుగురు కలిసి నన్ను కొడితే పడిపోతానేమో. కానీ ఆ నలుగురు కలిసి నన్ను కొట్టాలంటే చాలా కష్టం. నా చుట్టూ అభిమానులు నిర్మించిన చాలా పెద్ద కంచె ఉంది. సోషల్ మీడియాలో నాకు మద్దతుగా వస్తున్న పోస్టులు చూసిన తర్వాత, నేను ఎంత అభిమానాన్ని సంపాదించానో అర్థమైంది. ఇది నా ఆస్తి. నన్ను ఎవ్వడూ పీకలేడు.”

తన కొత్త సినిమా ప్రచారం కోసం నడిరోడ్డుపై ప్రాంక్ చేశాడు విశ్వక్. అది తప్పు అని అభిప్రాయపడింది టీవీ9. చర్చావేదికలో యాంకర్ కు, విశ్వక్ కు మధ్య మాటల యుద్ధం నడిచింది. ఒక దశలో యాంకర్, విశ్వక్ ను గెట్ అవుట్ ఆఫ్ మై స్టుడియో అంటే, అదే టైమ్ లో విశ్వక్ ఓ బూతు పదం వాడాడు.

జరిగిన వివాదంపై టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేస్తోంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కూడా ఫిర్యాదు చేశారు. మానవ హక్కుల కమిషన్ లో కూడా ఫిర్యాదు నమోదైంది. జరిగిన ఘటనపై ఇప్పటికే సారీ చెప్పిన విశ్వక్.. ఈ అంశాన్ని కొంతమంది ఇండస్ట్రీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.