Advertisement

Advertisement


Home > Movies - Movie News

హైప్ ఇచ్చిన సినిమాను అధికారికంగా ప్రకటించారు

హైప్ ఇచ్చిన సినిమాను అధికారికంగా ప్రకటించారు

కొన్ని రోజుల కిందటి సంగతి.. గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ.. ఈ 3 సినిమాల్లో మీకు బాగా కిక్కిచ్చిన సినిమా ఏదంటూ విశ్వక్ సేన్ కు ఓ ప్రశ్న ఎదురైంది. అప్పుడు అతడు ఈ 3 సినిమాల గురించి కాకుండా, మరో సినిమా గురించి మాట్లాడాడు. అదే లైలా. 

ఈమధ్య తనకు లైలా సినిమా మాత్రమే గుర్తొస్తోందని.. పడుకున్నా లైలా గురించే ఆలోచనలు తిరుగుతున్నాయని, అంతలా ఆ కథ నచ్చేసిందని, చాలా ఇంటెన్స్ ఉందని చెప్పుకొచ్చాడు. ఇప్పుడా సినిమాను అధికారికంగా ప్రకటించారు.

షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై రామ్ నారాయణ్ దర్శకత్వంలో లైలా సినిమాను ప్రకటించాడు నిర్మాత సాహు గారపాటి. దీనికి సంబంధించి టైటిల్ తో ఎనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్ చేశాడు. టెక్నీషియన్స్ లిస్ట్ కూడా వెల్లడించాడు.

విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లైలా సినిమాకు బాలీవుడ్ స్టార్ కంపోజర్ తనిష్క్ బాగ్చీ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో విశ్వక్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించనుంది. సినిమా ఆల్రెడీ సెట్స్ పైకి వచ్చేసింది. 

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ తర్వాత పూర్తిస్థాయిలో మెకానిక్ రాకీ, లైలా సినిమాలపై ఫోకస్ పెట్టబోతున్నాడు విశ్వక్ సేన్. వీటితో పాటు అతడి చేతిలో కల్ట్ అనే సినిమా కూడా ఉంది. ఈ సినిమాలో అతడు నటించడం లేదు. కథ ఇచ్చాడు, నిర్మిస్తున్నాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?