Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఫైట్స్ కూడా ఫాంటసీగానే ఉంటాయంట!

ఫైట్స్ కూడా ఫాంటసీగానే ఉంటాయంట!

విశ్వంభర సినిమా మేటర్ ఇది. ఫాంటసీ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫైట్స్ కూడా ఫాంటసీగానే ఉంటాయని చెబుతున్నారు మేకర్స్. ప్రస్తుతం షూట్ చేస్తున్న యాక్షన్ ఎపిసోడ్ కూడా అదే కోవకు చెందినదని చెబుతున్నారు.

రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ ఎపిసోడ్ ను పిక్చరైజ్ చేస్తున్నారు. దీనికోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ భారీ సెట్ వేశారు. విశ్వంభర సినిమా పంచభూతాల కాన్సెప్ట్ తో వస్తున్న సంగతి తెలిసిందే. ఈ పంచభూతాల్ని మిళితం చేస్తూ, ఇంటర్వెల్ ఎపిసోడ్ లో వచ్చే భారీ పైట్ సీన్ ను ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు.

వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే చిరు, త్రిషపై ఓ సాంగ్ తీశారు. కొంత టాకీ పార్ట్ తో పాటు, ఓ యాక్షన్ బ్లాక్ కూడా కంప్లీట్ చేశారు. తాజాగా మొదలైన షెడ్యూల్ ను పూర్తిగా యాక్షన్ ఎపిసోడ్ కే అంకితం చేశారు.

షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తిచేసి, కేవలం పోస్ట్ ప్రొడక్షన్ కోసమే 5 నెలలు టైమ్ తీసుకోవాలని భావిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో వస్తోంది విశ్వంభర సినిమా. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మ్యూజిక్ సిట్టింగ్స్ తోనే ఈ సినిమా మొదలైన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న విశ్వంభర థియేటర్లలోకి వస్తుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?