“ప్రభాస్ రాధేశ్యామ్ రిలీజ్ చేశాడు, అదే టైమ్ లో ది కశ్మీర్ ఫైల్స్ రిలీజ్ చేశాను. హిట్ కొట్టాను. ప్రభాస్ సలార్ రిలీజ్ చేసే టైమ్ కు వ్యాక్సిన్ వార్ సినిమా రెడీ చేస్తున్నాను.” దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఇచ్చిన స్టేట్ మెంట్ గా నిన్నట్నుంచి చక్కర్లు కొడుతోంది ఇది.
“వేల సంవత్సరాలుగా పురాణాలు అందరి మనసుల్లో ముద్రపడి ఉన్నాయంటే వాటి ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోవాలి. కొందరు స్క్రీన్ పైకి వస్తే నిజంగా దేవుళ్లు అయిపోతారా. రోజూ రాత్రి ఇంటికి తాగొచ్చి, తెల్లారి నేను దేవుడ్ని అంటే నమ్మడానికి ప్రేక్షకులు పిచ్చోళ్లా.” ఈ డైలాగ్ కూడా వివేక్ అగ్నిహోత్రిదే అంటూ ప్రచారం నడుస్తోంది.
ఎట్టకేలకు వీటిపై ఈ దర్శకుడు స్పందించాడు. ఇలాంటి అసత్యాలు ఎలా పుట్టుకొస్తున్నాయో తనకు అర్థం కావడం లేదంటూ స్పందించాడు వివేక్ అగ్నిహోత్రి. మెగా బడ్జెట్ సినిమాలు తీసే మెగా స్టార్ ప్రభాస్ ను తను గౌరవిస్తానని, ఇలాంటి అర్థంలేని ఫేక్ స్టేట్ మెంట్స్ ను ఎవరు సృష్టిస్తున్నారో తెలుసుకోవాలనుందంటూ స్పందించాడు వివేక్ అగ్నిహోత్రి.
తాము చిన్న బడ్జెట్ లో, ప్రజల కోసం మాత్రమే చిన్న సినిమాలు తీస్తుంటామని.. పెద్ద కాన్వాస్ పై పెద్ద సినిమాలు తీసే ప్రభాస్ తో తమకు పోలిక ఏంటంటూ ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చాడు అగ్నిహోత్రి.
అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 24 గంటలుగా వివేక్ అగ్నిహోత్రిపై ప్రభాస్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. దమ్ముంటే సలార్ సినిమాకు పోటీగా వ్యాక్సిన్ వార్ సినిమాను రిలీజ్ చేయాలని సవాల్ విసురుతున్నారు.