చిరు యాక్టింగ్… రెబల్ స్టయిల్.. మిక్స్ మసాలా

దర్శకుడు మెహర్ రమేష్ అంటే అటు రెబల్ స్టయిలిష్ యాక్షన్, ఇటు దారుణమైన ఫ్లాపులు రెండూ గుర్తుకు వస్తాయి. లేటెస్ట్ సినిమా భోళాశంకర్. మెగా స్టార్ హీరో. వేదాళం రీమేక్. ఎలా వుంటుందో అన్న…

దర్శకుడు మెహర్ రమేష్ అంటే అటు రెబల్ స్టయిలిష్ యాక్షన్, ఇటు దారుణమైన ఫ్లాపులు రెండూ గుర్తుకు వస్తాయి. లేటెస్ట్ సినిమా భోళాశంకర్. మెగా స్టార్ హీరో. వేదాళం రీమేక్. ఎలా వుంటుందో అన్న ఆసక్తి నడుమ ట్రయిలర్ వచ్చింది. 

మెగాస్టార్ చిరంజీవిని రెబల్ స్టయిల్ స్టయిలిష్ యాక్షన్ తో మిక్స్ చేసే ప్రయత్నం కనిపించింది. ఫైట్ల వరకు బాగానే మిక్స్ అయ్యారు. బాగానే కనిపించారు కూడా మెగాస్టార్. కానీ యాక్షన్ సీన్లు పక్కన పెట్టేస్తే ట్రయిలర్ గ్రాఫ్ మళ్లీ కిందకు దిగిపోయింది.

యాక్షన్ సీన్లు, మిగిలిన సన్నివేశాలు, పాటలు, అన్నీ ప్రాపర్ గా మిక్స్ అయిన ఫీల్ రాలేదు ట్రయిలర్ చూస్తుంటే. వేటికవే జాయింట్ చేసినట్లు వుంది తప్ప, అన్నీ కలిసి ఓ పెర్ ఫెక్ట్ కట్ అన్న ఫీల్ రాలేదు. సినిమా కథ కూడా కమర్షియల్ ఫార్మాట్ అని తెలిసిపోతోంది. కొత్తగా ఏదీ యాడ్ కాలేదని అర్థం అయిపోతోంది. పైగా అదే హీరో, అదే విలన్, అదే కమెడియన్లు, అవే మసాలా డైలాగులు అన్నీ కలిసి కొత్త ట్రయిలర్ ను చూస్తున్నాం అనే ఫీల్ ను కలగనివ్వలేదు.

మహతి స్వరసాగర్ నేపథ్య సంగీతం ఏమాత్రం అదనపు బలం కాలేకపోయింది. పైగా కొంచెం మైనస్ అని కూడా అనిపించింది. మెగా ఫ్యాన్స్ కు మాత్రం ట్రయిలర్ నచ్చే అవకాశం వుంది. ఎందుకంటే ఈ ఏజ్ లో కూడా ఏమాత్రం గ్రేస్ తగ్గకుండా వున్న చిరు లుక్స్, యాక్షన్ సీన్లు అన్నీ వాళ్లకు కచ్చితంగా నచ్చుతాయి.  ఆగస్టు రెండవ వారంలో విడుదలయ్యే ఈ సినిమాకు నిర్మాత అనిల్ సుంకర.