తీవ్రమైన ఛాతి నొప్పితో ఈరోజు పొద్దున్న చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయిన నటుడు వివేక్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కొన్ని గంటల వ్యవథిలోనే వివేక్ అనారోగ్యానికి గురికావడం అందర్నీ ఆందోళనకు గురిచేస్తోంది. వివేక్ ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశాయి.
ఈరోజు ఉదయం 11 గంటలకు హాస్పిటల్ లో జాయిన్ అయినప్పుడు వివేక్ అపస్మారక స్థితిలో ఉన్నారని తెలిపిన వైద్యులు.. వెంటనే ఆయనకు యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ నిర్వహించి ఐసీయూలో పెట్టామని స్పష్టంచేశారు.
ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని ప్రకటించిన వైద్యులు.. దీన్నొక ప్రత్యేకమైన గుండెపోటుగా నిర్థారించారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఈ గుండెపోటు వచ్చి ఉండకపోవచ్చని అభిప్రాయపడిన వైద్యులు.. మరో 24 గంటలు గడిస్తే తప్ప ఆరోగ్య పరిస్థితిపై అవగాహనకు రాలేమని చెప్పారు. ప్రస్తుతం ఐసీయూలోని ఎక్మో వ్యవస్థపై వివేక్ ఉన్నారు.