పవన్ కల్యాణ్ కు కరోనా పాజిటివ్

హీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు కరోనా సోకింది. వారం రోజులుగా హోం క్వారంటైన్ లో ఉన్న పవన్ కల్యాణ్ కు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ గా వచ్చింది. దీంతో వెంటనే…

హీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు కరోనా సోకింది. వారం రోజులుగా హోం క్వారంటైన్ లో ఉన్న పవన్ కల్యాణ్ కు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ గా వచ్చింది. దీంతో వెంటనే ఆయనకు ట్రీట్ మెంట్ మొదలుపెట్టారు.

3వ తేదీన తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు పవన్. ఆ టైమ్ లో కాస్త ఇబ్బందిగా అనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు. అప్పుడు నెగెటివ్ వచ్చింది. అయినప్పటికీ వైద్యుల సూచన మేరకు తన ఫామ్ హౌజ్ లో క్వారంటైన్ లో ఉండిపోయారు పవన్.

అయితే క్వారంటైన్ లో జ్వరం, ఒళ్లు నొప్పులతో ఇబ్బంది పడ్డారు పవన్. దీంతో 2 రోజుల కిందట మరోసారి పరీక్షలు నిర్వహించగా టెస్టుల్లో ఈసారి పాజిటివ్ వచ్చింది.

ఆ వెంటనే పవన్ కు ట్రీట్ మెంట్ స్టార్ట్ చేశారు. ఖమ్మంకు చెందిన ఓ వైద్యుడి పర్యవేక్షణలో పవన్ కు ట్రీట్ మెంట్ నడుస్తోంది. ఊపిరితిత్తుల్లో కొద్దిగా నిమ్ము చేరడంతో ఆ యాంగిల్ లో ట్రీట్ మెంట్ చేస్తున్నారు.

పవన్ ఫామ్ హౌజ్ లో ట్రీట్ మెంట్ కు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. ఖమ్మం డాక్టర్ తో పాటు అపోలో డాక్టర్లు కూడా పవన్ ను పర్యవేక్షిస్తున్నారు.