టాలీవుడ్ లో మంచి వాడు అనే ట్యాగ్ లైన్ చాలా తక్కువ మందికి వుంటుంది. ఏ ఒక్కరినీ నూరుశాతం మంది మంచి వాడుగా యాక్సెప్ట్ చేయరు. కానీ దర్శకుడు వివి వినాయక్ మాత్రం ఆ ట్యాగ్ లైన్ సంపాదించారు. వినాయక్ పేరు చెపితే, మంచి వాడు అనే మాటకు ఎవ్వరూ చిన్న కరెక్షన్ కూడా చెప్పరు. ఎన్నో ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు తీసారు.
మళ్లీ మంచి సినిమా వస్తుంది అనుకుంటే, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం అంత బాగా లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారని, ఇంటికే పరిమితం అయ్యారని తెలుస్తోంది. మనిషి శారీరకంగా బాగా తగ్గిపోయారని తెలుస్తోంది.
కొన్నాళ్ల క్రితం వినాయక్ ను మెయిన్ లీడ్ లో పెట్టి ఓ సినిమా తీయాలని దిల్ రాజు ప్లాన్ చేసారు. అది అలా ముందు వెనుక ఆడుతూ వుంది. ఈ లోగా వినాయక్ నే ఓ సినిమాను మెగాస్టార్ తో చేసే ఆలోచనలో వున్నారని వార్తలు వచ్చాయి. అందుకోసం స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నారని వినిపించింది,.
అయితే ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో ట్రీట్ మెంట్ లో వున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయమైన వినాయక్ సోదరుడు విజయ్ తో మాట్లాడితే, వినాయక్ పూర్తి ఆరోగ్యంగా వున్నారని, ఆరోగ్యం బాగా లేదు అనేది కొన్ని నెలల కిందటి సంగతి అని చెప్పారు. నంది హిల్స్ ఆఫీస్ కు త్వరలో వస్తారని, అప్పుడు కాల్ చేస్తామని చెప్పారు.