హీరో రామ్..డైరక్టర్ లింగుస్వామి కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా వారియర్. ఈ సినిమా మీద కాస్త అంచనాలు వున్నాయి. అందుకే ఈ సినిమాకను కాస్త ఎక్కువ రేటు కే మార్కెట్ చేస్తున్నారు.
ఆంధ్ర ఏరియాకు 18 కోట్లు చెబుతున్నారు. ఈ రేషియోలోనే విశాఖ, వెస్ట్ గోదావరి క్లోజ్ చేసారు. ఇటీవల కాలంలో వైజాగ్ మార్కెట్ బాగుంది. మిగిలిన ఏరియాల్లో కాస్త అటు ఇటుగా వున్న సినిమాలు కూడా విశాఖ లో బాగా పే చేస్తున్నాయి.
అంటే సుందరానికి సినిమా మిగిలిన ఏరియాలు నష్టపోతే విశాఖ ఏరియా లో బ్రేక్ ఈవెన్ దిశగా వెళ్తోంది. సర్కారు వారి పాట కూడా అంతే. అందుకే విశాఖ ఏరియాకు పోటీ పెరుగుతోంది.
వారియర్ సినిమా వైజాగ్ హక్కులను హీరో రామ్ నే తన స్వంతానికి తీసుకున్నారు. 18 కోట్ల రేషియోలో విశాఖ హక్కులను 4.32 కోట్లకు తీసుకున్నారు. పంపిణీ బాధ్యతలను అన్నపూర్ణ సాయిబాబు చూస్తారు. అలాగే వెస్ట్ గోదావరి హక్కులను ఎల్ వి ఆర్ కు ఇచ్చారు. మిగిలిన ఏరియాల బేరాలు సాగుతున్నాయి.
ఈ లెక్కన ఒక్క థియేటర్ హక్కుల మీదే 40 కోట్లకు పైగా కిట్టుబాటు అయ్యేలా వుంది. లింగుస్వామి మాస్ టేకింగ్ మీద జనాలకు కాస్త నమ్మకం వుంది. కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్. చిట్టూరి శ్రీను నిర్మాత.