రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ మళ్లీ కలిశారు. డబుల్ ఇస్మార్ట్ ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టారు. దాదాపు ఇస్మార్ట్ శంకర్ కోసం వర్క్ చేసిన టీమ్ నే డబుల్ ఇస్మార్ట్ కోసం రిపీట్ చేస్తున్నారు. మరి హీరోయిన్ల పరిస్థితేంటి?
ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. అప్పటికీ, ఇప్పటికీ వీళ్లిద్దరి కెరీర్స్ లో హిట్ సినిమా ఇదే. ఇస్మార్ట్ శంకర్ తర్వాత మళ్లీ వీళ్లు సక్సెస్ చూడలేదు. ఆ మాటకొస్తే, వాళ్లకు పెద్దగా అవకాశాలు కూడా రాలేదు
ఇలాంటి టైమ్ లో డబుల్ ఇస్మార్ట్ వస్తోంది. హీరోతో పాటు చాలామంది టెక్నీషియన్స్ ను రిపీట్ చేస్తున్న పూరి జగన్నాధ్, మరి హీరోయిన్లను కూడా రిపీట్ చేస్తాడా? దీనికి మాత్రం సరైన సమాధానం రావడం లేదు.
పైపెచ్చు.. నభా, నిధి కాకుండా.. శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ లాంటి బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో పూరి జగన్నాధ్ కూడా బాలీవుడ్ వైపే మొగ్గుచూపుతున్నాడు. ఎందుకంటే, డబుల్ ఇస్మార్ట్ ను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలనేది పూరి ప్లాన్. కాబట్టి హీరోయిన్లను కూడా లోకల్ గా కాకుండా, పాన్ ఇండియా అప్పీల్ ఉన్న వాళ్లను తీసుకుంటే బెటరని భావిస్తున్నాడు.
ఈ లెక్కల బట్టి చూసుకుంటే, డబుల్ ఇస్మార్ట్ లో ఇటు నభాకు, అటు నిధి కి ఎవ్వరికీ అవకాశం దక్కేలా కనిపించడం లేదు. మరి పూరి ఏం డిసైడ్ అయ్యాడో..?