బిగ్ టాస్క్.. బుచ్చిబాబు వల్ల అవుతుందా?

ఓ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నాడంటే కచ్చితంగా ఆ ప్రాజెక్టుకు అది పెద్ద ఎస్సెట్. ఏ సినిమాకైనా రెహ్మాన్ మ్యూజిక్ అదనపు ఆకర్షణ తెచ్చిపెడుతుంది. అలాంటప్పుడు టాలీవుడ్ లో పెద్ద ప్రాజెక్టుల కోసం…

ఓ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నాడంటే కచ్చితంగా ఆ ప్రాజెక్టుకు అది పెద్ద ఎస్సెట్. ఏ సినిమాకైనా రెహ్మాన్ మ్యూజిక్ అదనపు ఆకర్షణ తెచ్చిపెడుతుంది. అలాంటప్పుడు టాలీవుడ్ లో పెద్ద ప్రాజెక్టుల కోసం రెహ్మాన్ ను ఎందుకు తీసుకోరు?

తమన్, దేవిశ్రీప్రసాద్ లాంటి సంగీత దర్శకులకు ఇచ్చే రెమ్యూనరేషన్ కంటే ఇంకాస్త ఎక్కువ పెడితే, రెహ్మాన్ అందుబాటులోకి వస్తాడు కదా? కానీ చాలామంది మేకర్స్ రెహ్మాన్ ను ప్రిఫర్ చేయరు. దీనికి కారణం పారితోషికం కాదు, రెహ్మాన్ తో పనిచేయడం కష్టమనేది చాలామంది ఫీలింగ్.

పాట కోసం రెహ్మాన్ కు సీన్ ను వివరించడం ఒకెత్తయితే.. ఆ సందర్భానికి తగ్గ ట్యూన్ ను అతడి నుంచి రాబట్టుకోవడం మరో ఎత్తు. పాట సందర్భాన్ని రెహ్మాన్ కు పూసగుచ్చినట్టు చెప్పాలి. ఇంకా చెప్పాలంటే, పాత్రల స్వభావం, తీరుతెన్నులు కూడా వివరించాలి. ఇవన్నీ డిస్కషన్ టైమ్ లో రెహ్మాన్ అడుగుతాడు. అంతెందుకు, ఆ పాటను సెట్ లో తీస్తారా.. ఔట్ డోర్ లో చేస్తారా లాంటి అంశాలు కూడా రెహ్మాన్ కు చెప్పాల్సి ఉంటుంది.

ఇవన్నీ ఒకెత్తయితే, ఆస్కార్ అవార్డ్ గ్రహీత రెహ్మాన్ ను ఆప్షన్లు కోరడం మరో ఎత్తు. సాధారణంగా రెహ్మాన్ ఆప్షన్లు ఇవ్వడు. సందర్భానికి తగ్గట్టు ఓ ట్యూన్ చెబుతాడు. ఇంకో ట్యూన్ కూడా బాగుందనిపిస్తే, ఆ ఆప్షన్ కూడా ఇస్తాడు. ఇక రెహ్మాన్ తో వర్క్ చేయాలంటే, దర్శకులు రాత్రిళ్లు మేల్కొనాల్సి ఉంటుంది. కేవలం ట్యూన్స్ వరకు మాత్రమే కాదు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ కూడా రాత్రిళ్లు చేస్తుంటాడు రెహ్మాన్.

ఇలా అతడితో రాత్రిళ్లు వర్క్ చేసి, తిరిగి పొద్దున్నే సెట్స్ పైకి వెళ్లాలంటే ఏ దర్శకుడికైనా భారమే. ఇలాంటి సంగీత దర్శకుడితో పనిచేయబోతున్నాడు బుచ్చిబాబు. రామ్ చరణ్ సినిమా కోసం రెహ్మాన్ ను మ్యూజిక్ డైరక్టర్ గా తీసుకున్న సంగతి తెలిసిందే.

కేవలం ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న బుచ్చిబాబు, ఆస్కార్ అవార్డ్ గ్రహీత, మ్యూజిక్ లెజెండ్ రెహ్మాన్ నుంచి ఎలా ట్యూన్స్ రాబట్టుకుంటాడనేది ప్రశ్నార్థకంగా మారింది.