చనిపోయే ముందు సుశాంత్ ఏం చేశాడు?

బాలీవుడ్ హీరో సుశాంత్ మరణానికి సంబంధించి మరిన్ని వివరాలు ఈరోజు వెలుగులోకి వచ్చాయి. మరీ ముఖ్యంగా చనిపోవడానికి ముందు సుశాంత్ ఏం చేశాడనే అంశాన్ని ముంబయి పోలీసులు బయటపెట్టారు. చనిపోవడానికి కొన్ని గంటల ముందు…

బాలీవుడ్ హీరో సుశాంత్ మరణానికి సంబంధించి మరిన్ని వివరాలు ఈరోజు వెలుగులోకి వచ్చాయి. మరీ ముఖ్యంగా చనిపోవడానికి ముందు సుశాంత్ ఏం చేశాడనే అంశాన్ని ముంబయి పోలీసులు బయటపెట్టారు. చనిపోవడానికి కొన్ని గంటల ముందు సుశాంత్ గూగుల్ లో సెర్చ్ చేసిన పదాల్ని వెల్లడించారు.

జూన్ 14న సుశాంత్ చనిపోయాడు. ఆ రోజు, కొన్ని గంటల ముందు పెయిన్ లెస్ డెత్, స్కిజోఫీనియా, బై-పోలాల్ డిజార్డర్ లాంటి పదాల్ని సుశాంత్ గూగుల్ లో సెర్చ్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ముంబయి పోలీస్ కమిషనర్ పరమ్ వీర్ సింగ్ వివరాలు వెల్లడించారు.

మరోవైపు సుశాంత్ బ్యాంక్ ఖాతాలపై కూడా పోలీసులు కొన్ని వివరాలు వెల్లడించారు. 2019 జనవరి నుంచి ఈ ఏడాది జూన్ వరకు సుశాంత్ ఖాతాలకు సంబంధించిన లావాదేవీల్ని పరిశీలించిన పోలీసులు.. ప్రస్తుతం అతడి ఖాతాలో దాదాపు 14 కోట్ల 50 లక్షల రూపాయలున్నట్టు వెల్లడించారు. దీంతో పాటు అదే ఖాతాలో 4 కోట్ల రూపాయల ఫిక్స్ డ్ డిపాజిట్లు కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

మరోవైపు చనిపోవడానికి ముందు సుశాంత్ ఎలా ప్రవర్తించాడనే విషయాన్ని అతడి వంటమనుషులు వెల్లడించారు. వీళ్ల పేర్లు కేశవ్ బెచ్చార్, నీరజ్ సింగ్. చనిపోయిన రోజుతో పాటు ముందురోజు సుశాంత్ ఏం తిన్నాడనే విషయాన్ని నీరజ్ సింగ్ బయటపెట్టాడు.

చనిపోవడానికి ముందురోజు రాత్రి సుశాంత్ ఏమీ తినలేదట. డిన్నర్ వడ్డిస్తానని నీరజ్ అడిగితే, వద్దని చెప్పి జ్యూస్ మాత్రమే తాగడట. ఇక చనిపోయిన రోజు ఉదయం మరో వంట మనిషి కేశవ్ వచ్చి బ్రేక్ ఫాస్ట్ గురించి అడిగితే.. అరటి పండు, కొబ్బరినీళ్లు, జ్యూస్ మాత్రమే అడిగాడట సుశాంత్. 

ఏరు దాటాకా తెప్ప తగలేసిన బాబు