అప్పుడు లేవని నోళ్లు.. ఇప్పుడు లేస్తున్నాయేం!

మూడు రాజధానుల నిర్ణయాన్ని ఎలాగూ ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు స్వాగతించలేకపోయారు. కనీసం రాయలసీమ అభివృద్ధి కోరుకుంటున్న ఆ ప్రాంత వాసులైనా అభినందిస్తారనుకుంటే అదీ లేదు. కేవలం చంద్రబాబు అడుగులకు మడుగులొత్తే నాసిరకం నేతలు మాత్రమే…

మూడు రాజధానుల నిర్ణయాన్ని ఎలాగూ ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు స్వాగతించలేకపోయారు. కనీసం రాయలసీమ అభివృద్ధి కోరుకుంటున్న ఆ ప్రాంత వాసులైనా అభినందిస్తారనుకుంటే అదీ లేదు. కేవలం చంద్రబాబు అడుగులకు మడుగులొత్తే నాసిరకం నేతలు మాత్రమే టీడీపీలో మిగలడంతో వారిలో రాయలసీమ పౌరుషం ఏమాత్రం కనపడ్డంలేదు.

రాయలసీమకు హైకోర్టు వస్తుందని సంతోషం వ్యక్తం చేయకపోయినా పర్వాలేదు. కనీసం ఆ కోర్టు రాకుండా అడ్డుకోవాలని చూస్తున్న చంద్రబాబు నిర్ణయాన్ని ఎందుకు వ్యతిరేకించడం లేదు. అసలు రాయలసీమ నేతలకి ఆ ప్రాంత అభివృద్ధి అవసరం లేదా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ న్యాయవాదులు తమ ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేయమని అడిగితే, జిల్లాకో హైకోర్టు ఎందుకని వెటకారంగా మాట్లాడారు బాబు. చివరికి అనంతపురం జిల్లాకి రావాల్సిన ఎయిమ్స్ ఆస్పత్రిని కూడా అమరావతికి తీసుకెళ్లారు. చంద్రబాబుకి ఏమాత్రం రాయలసీమ మీద అభిమానం లేదు అనడానికి ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలి.

ఆయనకి లేదు సరే.. మిగతా సీమ టీడీపీ నేతలకు ఏమైంది. కర్నూలు న్యాయ రాజధానిగా ప్రకటించినంత మాత్రాన సీమకు ఒరిగేదేమీ లేదు, కర్నూలుని పూర్తి రాజధానిగా ప్రకటించాలంటూ నంద్యాల టీడీపీ ఎమ్మెల్సీ ఫరూక్ డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో ఆ నోరు ఏమైపోయింది. ఇప్పుడెందుకు లేస్తోంది. కర్నూలుకి హైకోర్టు వస్తే నాలుగు జిరాక్స్ సెంటర్లు, పది మందికి ఉద్యోగాలు వస్తాయే కానీ రాయలసీమకు ఏం ఒరుగుతుందని ప్రశ్నిస్తున్నారు ఏరాసు ప్రతాపరెడ్డి. కనీసం అదైనా ఒరిగింది కదా, అని అడిగితే మాత్రం సమాధానం లేదు.

ఇక డోన్ నేత కేఈ ప్రతాప్ వైసీపీ సంబరాలను అల్ప సంతోషంగా వెక్కిరించారు. కర్నూలుని పరిపాలనా రాజధానిగా చేయాలట, నీటివాటాల కోసం పోరాటం చేయాలట. అసలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నీటి వాటాలు ఏమైపోయాయి, పరిపాలనా రాజధాని ఎటుపోయింది. ఒక్కరైనా తమ నేతను అప్పడు ప్రశ్నించారా? సొంత లాభాలు చూసుకొని ఎక్కడివాళ్లు  అక్కడ సర్దుకున్నారు. అప్పుడు లేవని నోర్లు ఇప్పుడెందుకు లేస్తున్నాయి. 

కనీసం కర్నూలుని న్యాయరాజధానిగా అయినా ఈ నాయకులు ఉండనీయరా. టీడీపీ హయాంలో జరగని పనులన్నీ, వైసీపీ ప్రభుత్వంలో జరుగుతుండే సరికి వీరందరికీ కడుపుమంట. టీడీపీ హయాంలో వీరందరిలో రాయలసీమ పౌరుషం చచ్చిపోయింది, ఇప్పుడది బానిసత్వంలా మారింది.

ఏరు దాటాకా తెప్ప తగలేసి బాబు

చంద్రబాబు స్వయంకృతాపరాధం