రహస్యంగా నాలుగో పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్ ఎవరు?

అమెరికన్‌ సింగర్‌, నటి జెన్నీఫర్‌ లోపెజ్‌ మరోసారి పెళ్లిపీటలు ఎక్కింది. కొంతకాలంగా నటుడు బెన్‌ అఫ్లెక్‌, జెన్నీఫర్‌ డేటింగ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.  Advertisement తాజాగా ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ…

అమెరికన్‌ సింగర్‌, నటి జెన్నీఫర్‌ లోపెజ్‌ మరోసారి పెళ్లిపీటలు ఎక్కింది. కొంతకాలంగా నటుడు బెన్‌ అఫ్లెక్‌, జెన్నీఫర్‌ డేటింగ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. 

తాజాగా ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా జెన్నీఫర్‌ తన ఇన్‌స్టా‍గ్రామ్‌ వేదికగా వెల్లడించింది. ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ పెట్టుకున్న ఫొటోలను షేర్‌ చేస్తూ బెన్‌తో తన వివాహాన్ని అధికారికంగా ప్రకటిచింది.

కొద్ది మంది సన్నిహితులు మధ్య జూలై 16న లాస్‌ వెగాస్‌లో సీక్రెట్‌గా ఈ జంట పెళ్లి జరిగినట్లు స్టానిక మీడియా పేర్కొంది. దీంతో ఈ జంటకు సహా నటీనటులు, ఫాలోవర్స్‌ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

ఇక పెళ్లి అనంతరం కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఈ జంట కొత్త ఇంటిని వేతికే పనిలో పడ్డారని, ఆఖరికి బెవర్లీ హిల్స్‌లో ఇల్లు కొనుగొనుల చేశారని సమాచారం. 

కాగా 52 ఏళ్ల జెన్నీఫర్‌కు ఇప్పటికే మూడు పెళ్లిల్లు అయిన సంగతి తెలిసిందే. తాజాగా బెన్‌ అఫ్లెక్స్‌ను నాలుగవ వివాహం చేసుకుంది.