Advertisement

Advertisement


Home > Movies - Movie News

సలార్ లో సేతుపతి.. మరి ఆ హీరో సంగతేంటి?

సలార్ లో సేతుపతి.. మరి ఆ హీరో సంగతేంటి?

మాస్టర్ లో విజయ్ సేతుపతి పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అందరికీ  అతడ్ని విలన్ గా తీసుకోవాలనే ఉబలాటం ఎక్కువైంది. 

ఈ క్రమంలో ప్రభాస్ హీరోగా కొబ్బరికాయ కొట్టిన సలార్ సినిమాలో కూడా విజయ్ సేతుపతిని విలన్ గా తీసుకున్నారనే ప్రచారం మొదలైంది. మరి దీని కంటే ముందు జరిగిన ప్రచారం సంగతేంటి?

పాన్-ఇండియా మూవీగా రాబోతున్న సలార్ సినిమాలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాంను సంప్రదించినట్టు గతంలోనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు సడెన్ గా జాన్ అబ్రహాం స్థానంలో విజయ్ సేతుపతి పేరు వినిపిస్తోంది.

నిజానికి సలార్ సినిమాకు సంబంధించి కాస్టింగ్ ప్రాసెస్ ఇంకా మొదలుపెట్టలేదు. కేవలం కొన్ని చిన్న చిన్న పాత్రల కోసం ఆడిషన్స్ మాత్రమే పూర్తిచేశారు. 

హీరోయిన్, విలన్ లేకుండానే మొదటి షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఆ తర్వాత విలన్ ఎవరనే విషయాన్ని ప్రకటించబోతున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. 

క‌థ మొత్తం బంగారం చూట్టే

క్రాక్ సినిమా బాలీవుడ్ లో ఆ హీరోతో తీస్తా

ఏపీలో ఈడబ్ల్యూఎస్ కోటా అమలయ్యేనా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?