ఆచార్య.. ఆ పాట చుట్టూరా ప్రచారం

చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన మెగా మల్టీస్టారర్ మూవీ అది. సూపర్ హిట్ డైరక్టర్ కొరటాల తీసిన సినిమా అది. అద్భుతమైన ఆర్ట్ వర్క్ ఉన్న ప్రాజెక్ట్ అది. కాజల్, పూజాహెగ్డే లాంటి…

చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన మెగా మల్టీస్టారర్ మూవీ అది. సూపర్ హిట్ డైరక్టర్ కొరటాల తీసిన సినిమా అది. అద్భుతమైన ఆర్ట్ వర్క్ ఉన్న ప్రాజెక్ట్ అది. కాజల్, పూజాహెగ్డే లాంటి క్రేజీ భామలు నటించిన సినిమా అది. ఇలా ఆచార్య సినిమాలో చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. కానీ మేకర్స్ మాత్రం ఇవేవే హైలెట్ చేయడం లేదు.

ఆచార్య ప్రచారం అనగానే అంతా చిరు-చరణ్ కలిసి చేసిన డాన్స్ ను మాత్రమే హైలెట్ చేస్తున్నారు. సినిమా కథ ఎలా ఉండబోతోంది.. చిరు-చరణ్ పాత్రలేంటి.. లాంటి విషయాలేవీ మాట్లాడ్డం లేదు. అంతా చిరంజీవి-చరణ్ కలిసి చేసిన పాటనే హైలెట్ చేస్తున్నారు. మెగా కుటుంబ సభ్యులతో పాటు, ఇండస్ట్రీకి చెందిన బయట వ్యక్తులు కూడా చాలామంది ఆ పాట షూటింగ్ చూడ్డానికి వచ్చారని పదే పదే చెప్పుకుంటున్నారు. ఇదే విచిత్రం.

బంజారా అనే లిరిక్స్ తో సాగే ఈ పాట తాజాగా రిలీజైంది. కాబట్టి ప్రచారం మొత్తం ఆ సాంగ్ చుట్టూరా తిరుగుతుందని అనుకోవచ్చు. కానీ ఫ్రెష్ గా ఇంటర్వ్యూలు స్టార్ట్ చేశారు. ఆ ఇంటర్వ్యూల్లో కూడా ఇదే హైలెట్ అవుతోంది. సినిమాలో ఇంకేం లేవు, ఈ పాట ఒక్కటే ఉందన్న రేంజ్ లో యాంకర్ అడగడం.. దానికి రామ్ చరణ్ సుదీర్ఘంగా వివరణ ఇవ్వడం.. కొనసాగింపుగా కొరటాల ఇంకొంత మాట్లాడ్డం.. ఇదే ఆ ఇంటర్వ్యూలో హైలెట్ అవుతోంది. ఇది తప్పితే, మారేడుమిల్లి షూటింగ్ విశేషాలు గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ప్రస్తుతానికి ప్రచారంలో ఈ రెండే నలుగుతున్నాయి.

ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఆచార్య సినిమాలో చాలా ప్రత్యేకతలున్నాయి. వాటిని ఎందుకు యూనిట్ హైలెట్ చేయడం లేదో అంతుచిక్కడం లేదు. సదరు సాంగ్ లో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి అద్భుతంగా డాన్స్ చేసి ఉండొచ్చు. కానీ ఆ సాంగ్ మాత్రం హిట్ కాదు. ఎక్కడో, ఎన్నోసార్లు విన్నట్టు అనిపించే ట్యూన్ కొట్టారు మణిశర్మ.

రిలీజ్ కు ఇంకా వారం రోజులు మాత్రమే టైమ్ ఉంది. ఈ వారంలో చాలా కార్యక్రమాలు పెట్టుకున్నారు. ఆచార్య అంటే తండ్రికొడుకులు కలిసి చేసిన ఈ పాట మాత్రమే కాదని, ఇంకా చాలా ఉందనే విషయాన్ని తొందరగా గ్రహించి, కనీసం రాబోయే రోజుల్లోనైనా మిగతా అంశాల గురించి యూనిట్ మాట్లాడితే బాగుంటుందేమో.