Advertisement

Advertisement


Home > Movies - Movie News

ట్రెండింగ్ లో పూజా హెగ్డే.. కారణం ఏంటి?

ట్రెండింగ్ లో పూజా హెగ్డే.. కారణం ఏంటి?

హీరోయిన్ పూజా హెగ్డే కెరీర్ ప్రస్తుతం రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. ఓ పెద్ద సినిమా సెట్ అయితే, అందులో హీరోయిన్ గా పూజా హెగ్డేనే ముందుగా అనుకుంటున్నారు. అలా సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది పూజా హెగ్డే. అయితే ఇప్పుడామె ఎంజాయ్ చేస్తున్న ఈ స్టేటస్ కు మెయిన్ రీజన్ గా 'అల వైకుంఠపురములో' సినిమానే చెప్పుకోవాలి.

పూజా కెరీర్ ను 'అల వైకుంఠపురములో' సినిమాకు ముందు, తర్వాత అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాకు ముందు ఆమె మహర్షి, అరవింద సమేత లాంటి హిట్స్ కొట్టినప్పటికీ.. ఆమెకు స్టార్ స్టేటస్ తీసుకొచ్చింది మాత్రం అల వైకుంఠపురములో సినిమానే. మరీ ముఖ్యంగా పూజాకు 'బుట్టబొమ్మ' అనే ఇమేజ్ తెచ్చిపెట్టింది ఈ మూవీ.

బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా రిలీజై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, పూజాహెగ్డే మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అయింది. అప్పటి పూజా హెగ్డే ఫొటోల్ని ఫ్యాన్స్ మరోసారి వైరల్ చేస్తున్నారు.

పూజా హెగ్డే కూడా ఈ సంబరాల్లో భాగమైంది. అల వైకుంఠపురములో సినిమా విడుదలైనప్పుడు బన్నీ ఫ్యాన్స్ చేసిన హంగామా వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా అందరికీ మరోసారి థ్యాంక్స్ చెప్పింది.

'అల వైకుంఠపురములో' సినిమా తర్వాత ఈ బుట్టబొమ్మ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్.. ఇలా అన్నీ పెద్ద సినిమాలే చేస్తోంది ఈ పూజ.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?