Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆస్కార్ వేదికపై చరణ్ ఎందుకు డాన్స్ చేయలేదు?

ఆస్కార్ వేదికపై చరణ్ ఎందుకు డాన్స్ చేయలేదు?

వరల్డ్ వైడ్ ప్రేక్షకుల్ని ఆకర్షించింది నాటు-నాటు డాన్స్. చివరికి ప్రతిష్టాత్మక ఆస్కార్ వేదికపై కూడా ఈ పాటను ప్రత్యేకంగా ప్రదర్శించారు. కొంతమంది విదేశీ డాన్సర్లు ఈ పాటకు డాన్స్ చేసి, హాల్ ను ఉర్రూతలూగించారు.

సరిగ్గా ఇక్కడే చాలామందికి చాలా అనుమానాలు కలిగాయి. నాటు-నాటులో పాటలో డాన్స్ చేసిన చరణ్-తారక్ ఇద్దరూ అదే కార్యక్రమంలో ఉన్నారు. ఆహుతులతో కలిసి కూర్చున్నారు. నిర్వహకులు కోరితే మరోసారి ఆ పాటను రీక్రియేట్ చేసేందుకు చరణ్-తారక్ సిద్ధమే. ఎందుకంటే, అది ఆస్కార్ కార్యక్రమం.

కానీ అలా జరగలేదు. కేవలం కొంతమంది ఫారిన్ డాన్సర్లతోనే ఆ పాట పెర్ఫార్మెన్స్ పూర్తిచేశారు. మన సింగర్స్ మాత్రం స్టేజ్ పై మెరిశారు. దీనిపై రామ్ చరణ్ స్పందించాడు.

"ఆస్కార్ వేదికపై నాటు-నాటు సాంగ్ ను మరోసారి పెర్ఫార్మ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అవకాశం వస్తే డాన్స్ చేయడానికి నేను వందశాతం రెడీ. కానీ ఏం జరిగిందో నాకు తెలీదు. వేరే ట్రూప్ డాన్స్ చేసింది. అయితే మాకంటే బాగా వాళ్లు డాన్స్ చేశారు."

ఇలా ఆస్కార్ వేదికపై డాన్స్ చేసే అవకాశం తారక్ కు, తనకు ఎందుకు రాలేదో తెలియదన్నాడు రామ్ చరణ్. ఇక స్టేజ్ పై అవార్డ్ అందుకున్న తర్వాత కీరవాణి ఇచ్చిన స్పీచ్ పై కూడా స్పందించాడు చరణ్. తమ పేర్లు ప్రస్తావించకపోవడంపై పరోక్షంగా క్లారిటీ ఇచ్చాడు.

"ఆస్కార్ వేదికపై కీరవాణి ప్రసంగం విన్నాను. స్టేజ్ పై అంతా టైమ్ ప్రకారం నడుస్తుంది. 45 సెకెన్ల తర్వాత వాళ్లు మైక్ కట్ చేస్తారు. ఈ విషయంలో రాజమౌళి చాలా పట్టింపుతో ఉన్నాడు. 45 సెకెన్ల లోపు స్పీచ్ పూర్తయ్యేలా కీరవాణితో రాజమౌళి చాలా ప్రాక్టీస్ చేయించాడు. దాదాపు 20 సార్లు కీరవాణి రిహార్సల్స్ చేశారు. కీరవాణి కూడా అద్భతంగా మాట్లాడారు."

హాలీవుడ్ లో నటించాలనే ఆసక్తి తనకు ఉందని, అదే విషయాన్ని లాస్ ఏంజెల్స్ లో ప్రకటించానని తెలిపిన రామ్ చరణ్.. తనకు హాలీవుడ్ ఆఫర్ వస్తుందా రాదా అనే విషయాన్ని లాస్ ఏంజెల్స్ కు వదిలేశానని వెల్లడించాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?