అనిరుధ్ ఈసారైనా టాలీవుడ్ లో క్లిక్ అవుతాడా?

స్టార్ కంపోజర్ అనిరుధ్, అడపాదడపా తెలుగులో సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అయితే కోలీవుడ్ లో ఇస్తున్నంత సౌండ్, టాలీవుడ్ లో ఇవ్వలేకపోతున్నాడు. తమిళ్ లో అతడి పాటలు సూపర్ డూపర్ హిట్టవుతున్నాయి. యూట్యూబ్ లో…

స్టార్ కంపోజర్ అనిరుధ్, అడపాదడపా తెలుగులో సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అయితే కోలీవుడ్ లో ఇస్తున్నంత సౌండ్, టాలీవుడ్ లో ఇవ్వలేకపోతున్నాడు. తమిళ్ లో అతడి పాటలు సూపర్ డూపర్ హిట్టవుతున్నాయి. యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. ఆ మేజిక్ టాలీవుడ్ లో రిపీట్ అవ్వడం లేదు. కానీ అతడిపై నమ్మకంతో ఎప్పటికప్పుడు తెలుగు నుంచి అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

ఇప్పుడు మరోసారి టాలీవుడ్ లో ఓ సినిమాకు సంగీతం అందించే అవకాశం అందుకున్నాడు అనిరుధ్. త్వరలోనే శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాకు అనిరుధ్ ను సంగీత దర్శకుడిగా తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఇంతకుముందు తమన్, గోపీసుందర్ తో వర్క్ చేసిన శివనిర్వాణ, ఈసారి అనిరుధ్ కోసం ట్రై చేస్తున్నాడు.

అజ్ఞాతవాసి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అనిరుధ్. కానీ అదేమంత పెద్దగా వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత గ్యాంగ్ లీడర్, జెర్సీ లాంటి సినిమాలకు పనిచేసినప్పటికీ, చార్ట్ బస్టర్స్ అందించలేకపోయాడు. ఆ తర్వాత పూర్తిగా కోలీవుడ్ కే పరిమితమైన అనిరుధ్, తాజాగా విజయ్ హీరోగా నటిస్తున్న బీస్ట్ సినిమాకు సూపర్ ఆల్బమ్ అందించాడు. దీంతో అతడికి మరోసారి టాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి.

విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ కాంబోలో రాబోతున్న సినిమా ప్రేమకథే అయినప్పటికీ, దీని కోసం డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నాడు దర్శకుడు. సినిమాలో కొంత భాగం కథ కశ్మీర్ నేపథ్యంలో సాగుతుంది.