Advertisement

Advertisement


Home > Movies - Movie News

బాలకృష్ణ 'దిద్దుబాటు' చర్యలకు దిగుతారా?

బాలకృష్ణ 'దిద్దుబాటు' చర్యలకు దిగుతారా?

తన సినిమా ఫంక్షన్ లో బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రస్తుతం ఎంత దుమారం చెలరేగుతుందో అందరం చూస్తూనే ఉన్నాం. స్వయంగా నాగచైతన్య ఈ వివాదంపై స్పందించాడు. "నందమూరి తారకరామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వీ రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు. వారిని అగౌరవపరచడం మనల్ని మనమే కించపరుచుకోవడం" అంటూ పోస్ట్ పెట్టాడు.

అటు బాలకృష్ణ వ్యాఖ్యలపై చాలామంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. పైకి ఏం మాట్లాడనప్పటికీ చాలామంది సినీ ప్రముఖులు ఈ అంశంపై చర్చించుకుంటున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై మరోసారి స్పందించాలని బాలయ్య నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

"అక్కినేని-తొక్కనేని" అంటూ తను చేసిన వ్యాఖ్యలపై నష్టనివారణ చర్యల కోసం బాలకృష్ణ, అతడి అనుచరగణం ఆలోచనలు చేస్తోంది. దీనిపై ప్రెస్ నోట్ విడుదల చేయాలా లేక మరో సందర్భంలో ఈ వ్యాఖ్యల్ని కవర్ చేస్తూ మాట్లాడాలా అనే అంశంపై చర్చలు సాగుతున్నాయి.

గతంలో ఓసారి ఇలానే మహిళలపై నోరుజారారు బాలకృష్ణ. మహిళలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై చింతిస్తూ ఆయన క్షమాపణలు చెప్పారు. అదే కోవలో ఈ  "అక్కినేని-తొక్కినేని" వ్యవహారంపై కూడా స్పందించాలని బాలయ్య కోటరీలో కొందరి అభిప్రాయం.

బాలకృష్ణ ఇలా 'క్షమాపణ' అంశంపై ఆలోచనలు చేయడానికి ప్రధాన కారణం వేరే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు ఎలక్షన్ ఫీవర్ ఊపందుకుంది. ఏ చిన్న అంశాన్ని వైసీపీ నేతలు వదిలిపెట్టడం లేదు. సరిగ్గా ఇలాంటి కీలక సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ. ఈ వ్యాఖ్యలు ఎక్కడ రాజకీయ రంగు పులుముకుంటాయోనని చంద్రబాబు భయం. ఆ భయంతోనే బాలకృష్ణకు బాబు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది.

మరోవైపు ఈ మొత్తం వ్యవహారంలో నాగార్జున ఎక్కడా స్పందించకపోవడం మరో చర్చకు దారితీసింది. బాలకృష్ణ-నాగార్జున మధ్య అభిప్రాయబేధాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. ఇలాంటి సున్నితమైన పరిస్థితుల్లో తను స్పందిస్తే, వివాదం మరింత ముదురుతుందనే భావనతో నాగార్జున వెనక్కితగ్గి, చైతూతో పోస్ట్ పెట్టించినట్టు తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?