భువనేశ్వరిపై వ్యాఖ్యలు, చంద్రబాబు ఏడుపు, నందమూరి ఫ్యామిలీ రియాక్షన్.. ఇవన్నీ ఒక సీక్వెన్స్ లో జరిగిపోయాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ రెస్పాన్స్ సరిగా లేదని టీడీపీ బ్యాచ్ హంగామా చేసింది. ఇంకా చేస్తోంది కూడా.
సహజంగా టీడీపీతో తేడాలొస్తే, ఎన్టీఆర్ సినిమా రోజు ఆ ప్రభావం కనిపిస్తుంది. యాంటీ బ్యాచ్ నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తుంది. మరి ఈసారి భువనేశ్వరి ఎపిసోడ్ ఆర్ఆర్ఆర్ పై ప్రభావం చూపిస్తుందా?
ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు అటుఇటుగా నెల రోజులు టైమ్ ఉంది. అంతవరకు భువనేశ్వరి ఎపిసోడ్ ను వేడివేడిగా ఉంచడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యం. పైగా మొత్తం వివాదానికి కేంద్రమైన వల్లభనేని వంశీ, ఆమెకు భేషరతుగా క్షమాపణలు చెప్పేశారు. సో.. ఇటువైపు నుంచి అంతా క్లియర్. ఎటొచ్చి ఎన్టీఆర్ ఇష్యూను టీడీపీ జనాలు వదిలిపెడతారా లేదా అనేదే తేలాల్సిన అంశం.
ఎన్టీఆర్ ను పూర్తిగా టీడీపీకి దూరం చేసేందుకు బాబు బ్రహ్మాండమైన స్కెచ్ వేశారు. భువనేశ్వరి ఇష్యూను ఆయుధంగా మలుచుకున్నారు. వర్ల రామయ్య లాంటి వాళ్లను రెచ్చగొట్టారు. టీడీపీ కార్యకర్తలతో అనరాని మాటలు అనిపించారు.
సో.. ఓవైపు భువనేశ్వరి ఎపిసోడ్ చల్లారినప్పటికీ, దానికి అనుగుణంగా జరిగిన ఎన్టీఆర్ ఎపిసోడ్ ను మాత్రం చంద్రబాబు వదిలిపెట్టే అవకాశాలు కనిపించడం లేదు. ఆర్ఆర్ఆర్ విడుదల నాటికి తన మనుషుల్ని మరింత రెచ్చగొట్టి, ఎన్టీఆర్ ను పూర్తిగా పార్టీకి దూరం చేయడం బాబు టార్గెట్ గా కనిపిస్తోంది.
పైగా ఈసారి చంద్రబాబు, ఒక దెబ్బకు 2 పిట్టలు టైపులో ఆలోచిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ను టార్గెట్ చేస్తే అటు ఎన్టీఆర్ తో పాటు, ఇటు మెగా కాంపౌండ్ మనుషులకు కూడా చెక్ పెట్టినట్టవుతుంది. ఎందుకంటే, ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా నటించాడు.
కొన్నాళ్లుగా చిరంజీవితో పాటు ఇతర మెగా సభ్యులు జగన్ కు మద్దతుగా నిలుస్తున్నారు. పలు సందర్భాల్లో చిరంజీవి, జగన్ ను పొగిడిన సందర్భాలూ ఉన్నాయి. వీటన్నింటినీ ఓ కంట కనిబెడుతున్న చంద్రబాబు.. ఆర్ఆర్ఆర్ ను టార్గెట్ చేస్తే మెగా మనుషులు కూడా తన దారికొస్తారని ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది.
రాజకీయంగా జరిగే అవకాశాలున్న ఈ పరిణామాలన్నీ ఆర్ఆర్ఆర్ పై ప్రభావం చూపించడం పక్కా. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. కిందామీద పడి సంక్రాంతికి వస్తోంది.
కరోనా దెబ్బ, ఏపీలో టికెట్ రేట్ల వ్యవహారంతో ఆల్రెడీ ప్రీ-రిలీజ్ బిజినెస్ ను కొంతమేర తగ్గించుకున్నారు. ఇలాంటి టైమ్ లో చంద్రబాబు మనుషులు ఆర్ఆర్ఆర్ రిలీజ్ టైమ్ లో ఎన్టీఆర్ పై మరోసారి దృష్టిపెడితే అంతే సంగతి.