జడ్జిమెంట్ విషయంలో దిల్ రాజు తోపు. అతడు హిట్ అని చెప్పాడంటే ఆ సినిమా హిట్టవ్వాల్సిందే. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు కాదు. ఈమధ్య కాలంలో దిల్ రాజు జడ్జిమెంట్ కాస్త గాడితప్పింది. మరీ ముఖ్యంగా శ్రీనివాసకల్యాణం, జాను, లవర్ లాంటి సినిమాల తర్వాత దిల్ రాజు జడ్జిమెంట్ పై జనాలకు నమ్మకం పోయింది.
ఇలాంటి టైమ్ లో మరోసారి తన జడ్జిమెంట్ పై తనకుతానుగా స్వయంగా స్టేట్ మెంట్ ఇచ్చాడు దిల్ రాజు. ఈసారి తన జడ్జిమెంట్ గురి తప్పదంటున్నాడు. షాదీ ముబారక్ అనే సినిమాను రిలీజ్ చేస్తున్న ఈ నిర్మాత.. ఈసారి కచ్చితంగా హిట్ కొడతానంటున్నాడు.
“ఇలాంటి చిన్న సినిమాలన్నీ నా జడ్జిమెంట్ మీద రన్ అవుతాయి. ఈ సినిమాను చూపించిన వెంటనే శాటిలైట్, డిజిటల్ డీల్స్ క్లోజ్ అయ్యాయి. అక్కడే నా జడ్జిమెంట్ సగం నిజమైంది. నా జడ్జిమెంట్ మీద నమ్మకంతో, నేనే డబ్బులు పెట్టి మిగతా సగం సినిమాను కూడా పూర్తిచేశాను. ఈసారి నా గురి తప్పదు.”
దిల్ రాజు నుంచి ఇలాంటి స్టేట్ మెంట్స్ గతంలో కూడా వచ్చాయి. ఇంకా చెప్పాలంటే ఇంతకంటే గట్టి మాటలే వినిపించాయి. శ్రీనివాసకల్యాణం సినిమానైతే తనకు రెండో 'బొమ్మరిల్లు'గా చెప్పుకొచ్చాడు.
జాను సినిమా టైమ్ లో హీరోహీరోయిన్లకు బ్లాక్ బస్టర్ ఇస్తున్నానంటూ ప్రకటించుకున్నాడు. అవేవీ నిజం అవ్వలేదు. మరి ఈసారైనా దిల్ రాజు జడ్జిమెంట్ ఫలిస్తుందో లేదో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.