ఇప్పటికే ఎన్నో రికార్డులు సృష్టించాడు. కానీ తను క్రియేట్ చేసిన రికార్డ్ ను తానే అందుకోలేకపోతున్నాడు ప్రభాస్. అదే 200 కోట్ల రూపాయల ఓపెనింగ్.
రాజమౌళి-ప్రభాస్ కాంబోలో వచ్చిన బాహుబలి-2 సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల రూపాయల గ్రాస్ దాటేసింది. ఆ తర్వాత రాజమౌళి-తారక్-చరణ్ కాంబోలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఫస్ట్ డే రూ.200 కోట్లు గ్రాస్ క్రాస్ చేసింది.
బాహుబలి-2 తర్వాత మళ్లీ ఆ ఘనత సొంతం చేసుకోలేకపోయాడు ప్రభాస్. అతడు నటించిన సాహో, రాధేశ్యామ్ సినిమాల సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్-ప్రశాంత్ నీల్ కలిసి ఆ ఘనత సాధిస్తారని అంతా ఊహించారు.
కానీ సలార్ సినిమా కూడా ఆ ఘనత సాధించలేకపోయింది. సౌత్ లోని కొన్ని భాషలతో పాటు, మరికొన్ని దేశాల్లో ఈ సినిమాకు ఓపెనింగ్స్ రాలేదు. ఇప్పుడు కల్కి సినిమా వంతు వచ్చింది.
ఈ సినిమాతో ప్రభాస్ కచ్చితంగా రూ.200 కోట్ల ఓపెనింగ్ సాధిస్తాడని అతడి ఫ్యాన్స్ నమ్మకంగా చెబుతున్నారు. ఎందుకంటే, ఇందులో ప్రభాస్ తో పాటు దీపిక, అమితాబ్, కమల్ హాసన్ ఉన్నారు. పైగా సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
మార్కెట్లో పరిస్థితులు కూడా కల్కికి అనుకూలంగా ఉన్నాయి. తెలుగులో లైన్ క్లియర్. తమిళ్ లో మహారాజ హవా మెల్లగా తగ్గుతోంది. మలయాళం, కన్నడలో పెద్ద సినిమాల్లేవు. అటు నార్త్ బెల్ట్ కూడా పెద్ద సినిమా కోసం అర్రులుచాస్తోంది. దీనికితోడు తెలుగు రాష్ట్రాలతో పాటు, యూఎస్ లో పెంచిన టికెట్ రేట్లు ఈ సినిమా ఓపెనింగ్ కు మంచి పునాది వేశాయి. సో.. ఈసారి ప్రభాస్‌ల ఆ ఘనత సాధిస్తాడేమో చూడాలి.