విజయ్ సేతుపతి సినిమా మహరాజా. ఓ చిన్న తమిళ సినిమా తెలుగునాట దుమ్ము దులుపుతోంది. వైజాగ్ లాంటి చిన్న ఏరియాలో కోటి రూపాయల వసూళ్లు కనిపిస్తున్నాయి. నైజాంలో అయిదున్నర కోట్ల గ్రాస్ వసూళ్లు కనిపిస్తున్నాయి. కేవలం మౌత్ టాక్ తో వచ్చిన సక్సెస్ ఇది. విడుదలకు ముందు వారాల కొద్దీ ప్రమోషన్ హడావుడి లేదు. ట్వీట్ల వర్షం లేదు. జస్ట్ సినిమా విడుదలైన మార్నింగ్ షో నుంచే మౌత్ టాక్ తో స్టార్ట్ అయింది.
సాదా సీదా ఓపెనింగ్. అయినా సినిమాను ప్రత్యేకంగా లేపే ప్రయత్నం చేయలేదు. కలెక్షన్ పోస్టర్లు వేయలేదు. ఏ హఢావుడి లేదు. కానీ సినిమా జనాలకు రీచ్ అయిపోయింది. నైజాంలొ అయిదున్నర కోట్ల గ్రాస్ అంటే చిన్న సినిమా అతి పెద్ద విజయం అన్నమాట. కంటెంట్ నిజంగా బాగుంటే సోషల్ మీడియానే నెత్తిన పెట్టుకుని మోసేస్తుంది. కంటెంట్ యావరేజ్ అయితే మాత్రం యాంటీ ట్రోలింగ్ వుంటుంది.
అందువల్ల నూటికి నూరు పాళ్లు కంటెంట్ బాగుండేలా చూసుకుంటే చాలు. జనాలు థియటర్ కు వస్తారు. సినిమాను చూస్తారు. అలా కాకుండా మేం బాగానే తీసాం. రివ్యూలు రాయడం రాదు. జనాలకు చూడడం రాదు అని చెప్పుకునే దర్శకులు కూడా వుంటారు. ఆత్మవంచన తప్ప మరేం కాదు. అవుటాఫ్ ది బాక్స్ అయిడియాలు, తక్కువలో మంచి సినిమా తీయడం అన్నది టాలీవుడ్ లో చాలా అరుదుగా జరుగుతూ వుంటుందేమో?