భారతీయుడు 2 ట్రయిలర్ రెడీ

తమ సినిమా వాయిదా పడలేదని, చెప్పిన టైమ్ కు వస్తుందంటూ కొన్ని రోజుల కిందట లైకా ప్రొడక్షన్స్ క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ భారతీయుడు-2 విడుదల తేదీపై అక్కడక్కడ అనుమానాలు వినిపిస్తూనే ఉన్నాయి. Advertisement ఎట్టకేలకు…

తమ సినిమా వాయిదా పడలేదని, చెప్పిన టైమ్ కు వస్తుందంటూ కొన్ని రోజుల కిందట లైకా ప్రొడక్షన్స్ క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ భారతీయుడు-2 విడుదల తేదీపై అక్కడక్కడ అనుమానాలు వినిపిస్తూనే ఉన్నాయి.

ఎట్టకేలకు లైకా నుంచి మరో పెద్ద అప్ డేట్ వచ్చింది. భారతీయుడు-2 ట్రయిలర్ రిలీజ్ కు డేట్ ఎనౌన్స్ చేశారు. దీంతో సినిమా విడుదలపై కొనసాగుతున్న చిన్నపాటి అనుమానాలకు తెరపడింది.

మంగళవారం ఈ సినిమా ట్రయిలర్ ను లాంచ్ చేయబోతున్నారు. ఈ మేరకు లైకా ప్రొడక్షన్ నుంచి సరికొత్త పోస్టర్ రిలీజైంది. జులై 12 థియేట్రికల్ రిలీజ్ అంటూ ఈ సందర్భంగా మరోసారి ప్రకటించారు.

మొన్ననే కల్కి ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కోసం ముంబయి వెళ్లారు కమల్ హాసన్. ఇప్పుడు భారతీయుడు-2 ట్రయిలర్ రిలీజ్ కోసం మరోసారి ముంబయి వెళ్తున్నారు. అక్కడే ఈ సినిమా ట్రయిలర్ లాంచ్ చేస్తారు. ఆ తర్వాత రాష్ట్రాల వారీగా ప్రచారం నిర్వహిస్తారు.

శంకర్-కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కింది భారతీయుడు-2 సినిమా. భారతీయుడు సినిమా ఎక్కడ ముగిసిందో, సరిగ్గా అక్కడే భారతీయుడు-2 కథ మొదలవుతుంది. సేనాపతి ఇండియాకొచ్చి దేశంలో అవినీతిని ఎలా అంతం చేశాడో ఈ సినిమాలో చూడొచ్చు. భారతీయుడు-2 థియేటర్లలోకి వచ్చిన 6 నెలల గ్యాప్ లోనే భారతీయుడు 3ని కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

కాజల్, రకుల్, సిద్దార్థ్, ఎస్ జే సూర్య కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించాడు. పాటలు పెద్దగా క్లిక్ అవ్వనప్పటికీ సినిమాపై క్రేజ్ మాత్రం అలానే ఉంది.