Advertisement

Advertisement


Home > Movies - Movie News

కల్కి రిలీజ్.. మరోసారి సలార్ పరిస్థితులు?

కల్కి రిలీజ్.. మరోసారి సలార్ పరిస్థితులు?

సలార్ సినిమా విడుదల టైమ్ లో టాలీవుడ్ లో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. సలార్ పోస్ట్ పోన్ అయి, మరో విడుదల తేదీ ప్రకటించగానే కొన్ని సినిమాలు చెల్లాచెదురయ్యాయి. సైంధవ్ సినిమా సంక్రాంతికి వెళ్లిపోగా.. హాయ్ నాన్న సినిమాను కాస్త ముందుగా రిలీజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక మిగతా సినిమాలన్నీ ఎక్కడివక్కడ సర్దుకున్నాయి.

మరి కల్కి వాయిదాతో అలాంటి పరిస్థితులు మరోసారి పునరావృతం అవుతాయా? మే 9 నుంచి ఈ సినిమా వాయిదా పడడం పక్కా అని తేలిపోయింది. అధికారిక ప్రకటన ఒక్కటే బ్యాలెన్స్. మరి వాయిదాపడి ఎక్కడ సెటిల్ అవుతుంది.. ఏ సినిమాపై దాని ప్రభావం పడుతుంది..?

ఈసారి అలాంటి సమస్యలు ఉత్పన్నం కాకపోవచ్చు. పెద్ద సినిమాల తేదీలన్నీ ఆల్రెడీ వచ్చేశాయి. పుష్ప-2 సినిమా ఆగస్ట్ 15కు, సరిపోదా శనివారం ఆగస్ట్ 29కి, ఓజీ సినిమా సెప్టెంబర్ 27కి, దేవర అక్టోబర్ 10కి ఇప్పటికే షెడ్యూల్ అయి ఉన్నాయి.

ఈ తేదీల్లో దేనిపైనైనా కల్కి యూనిట్ కన్నేస్తే క్లాష్ తప్పదు. అయితే కల్కికి ఆ పరిస్థితి రాకపోవచ్చు. ఎందుకంటే.. మే9 నుంచి వాయిదా పడబోయే ఈ సినిమాకు అదే నెలలో కొన్ని తేదీలు అందుబాటులో ఉన్నాయి. జూన్, జులై నెలల్లో కూడా బడా సినిమాల్లేవు. పండగ తేదీలు, లాంగ్ వీకెండ్స్ కావాలనుకుంటే మాత్రం క్లాష్ తప్పదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?