ఈ కాలం సినిమాకు హిట్ టాక్ వస్తేనే ఆడియన్స్ ఇళ్లు విడిచి థియేటర్లకు వస్తున్నారు. ఏమాత్రం నెగెటివ్ టాక్ వచ్చినా కాలు కదపడం లేదు. భీమా విషయంలో అదే జరిగింది. మొదటి రోజు మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రోజురోజుకు క్షీణించింది.
మొదటి వారాంతం ఈ సినిమాకు ఓ మోస్తరుగా వసూళ్లు వచ్చినప్పటికీ, రెండో వీకెండ్ లో మాత్రం ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది భీమా. నిన్న శనివారం, ఈరోజు ఆదివారం ఈ సినిమా వసూళ్లలో పూర్తిగా వెనకబడింది.
భీమాతో పాటు గామి, ప్రేమలు అనే 2 సినిమాలొచ్చాయి. వీటిలో గామి సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ప్రేమలు సినిమా మౌత్ టాక్ తో కాస్త అందుకుంది. భీమా సినిమా ఈ రెండు అంశాల్లో వెనకబడింది. మంచి ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది, మౌత్ టాక్ కూడా కలిసిరాలేదు.
ఈ సినిమాకు ఆడియన్స్ ను రప్పించేందుకు గోపీచంద్ చేయని ప్రయత్నం లేదు. తాజాగా కూడా ఓ కార్యక్రమం నిర్వహించారు. “పరీక్షలైపోయాయి, థియేటర్లకు రండి, భీమా చూడండి” అంటూ గోపీచంద్ స్వయంగా రిక్వెస్ట్ చేశాడు. అయినా నిన్న, ఈరోజు వసూళ్లపై ఈ ప్రచారం పెద్దగా ప్రభావం చూపించలేదు. అలా గోపీచంద్ కెరీర్ లో మరో ఫ్లాప్ వచ్చి చేరింది.