Advertisement

Advertisement


Home > Movies - Movie News

రవితేజ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా?

రవితేజ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా?

క్రాక్ సినిమా రిలీజ్ కు ముందు దర్శకుడు గోపీచంద్ మలినేనికి ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు రవితేజ. క్రాక్ హిట్టయితే, వెంటనే అతడితో మరో సినిమా ఎనౌన్స్ చేస్తానని ప్రకటించాడు. 

కట్ చేస్తే, క్రాక్ ఇప్పుడు హిట్టయింది. దాదాపు ఈ సంక్రాంతి విజేత ఈ సినిమానే. మరి రవితేజ మరోసారి గోపీచంద్ మలినేనికి ఛాన్స్ ఇస్తాడా? అసలు ఇప్పటికిప్పుడు వీళ్లిద్దరూ కలిసి సినిమా చేసే అవకాశం ఉందా?

ప్రస్తుతం రవితేజ ఖిలాడీ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా తర్వాత లిస్ట్ లో త్రినాథరావు నక్కిన మూవీ ఉంది. ఖిలాడీ కంప్లీట్ అయ్యే లోపు, మరో స్టోరీలైన్ తో గోపీచంద్ మలినేని ముందుకొస్తే.. త్రినాధరావు నక్కిన సినిమా ఇంకాస్త ఆలస్యమవ్వడం ఖాయం. ఎందుకంటే త్రినాధరావు నక్కినతో చేయాల్సిన సినిమా నిర్మాతతో రవితేజకు ఉన్న నియమ-నిబంధనలు అలా ఉన్నాయి మరి.

ఇక గోపీచంద్ మలినేని విషయానికొద్దాం. క్రాక్ హిట్ తర్వాత ఈ దర్శకుడు వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు. లిస్ట్ లో ఇప్పటికే బాలకృష్ణ, రామ్ లాంటి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. అందర్నీ పక్కనపెట్టి, మరోసారి రవితేజ కోసం మలినేని కూర్చుంటాడా అనేది ఆసక్తికరం.

ఏదేమైనా.. ఇప్పటికిప్పుడు రవితేజ-గోపీచంద్ మలినేని కలిసి సినిమా చేయలేకపోవచ్చు కానీ.. రాబోయే రోజుల్లో కచ్చితంగా వీళ్ల నుంచి మరో సినిమా రావడం మాత్రం గ్యారెంటీ. ఎందుకంటే ఇప్పుడు వీళ్లది హిట్ కాంబినేషన్ కదా. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?