త్వరలోనే మరో టాలీవుడ్ నటుడి పెళ్లి?

ఇప్పటికే నిఖిల్ పెళ్లి చేసుకున్నాడు. నితిన్ కూడా పెళ్లి చేసుకున్నాడు. తాజాగా రానా కూడా ఓ ఇంటివాడయ్యాడు. ఇప్పుడీ లిస్ట్ లోకి హీరో సందీప్ కిషన్ కూడా చేరబోతున్నాడట. ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న…

ఇప్పటికే నిఖిల్ పెళ్లి చేసుకున్నాడు. నితిన్ కూడా పెళ్లి చేసుకున్నాడు. తాజాగా రానా కూడా ఓ ఇంటివాడయ్యాడు. ఇప్పుడీ లిస్ట్ లోకి హీరో సందీప్ కిషన్ కూడా చేరబోతున్నాడట. ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. త్వరలోనే తన కాబోయే భార్య వివరాల్ని బయటపెట్టబోతున్నాడు ఈ యంగ్ హీరో.

సందీప్ కిషన్ ఇండస్ట్రీకొచ్చి సరిగ్గా దశాబ్దం అవుతోంది. ఈ పదేళ్ల కాలంలో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్. ప్రస్తుతం తెలుగు-తమిళ భాషల్లో బిజీ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు. రీసెంట్ గా నిర్మాతగా కూడా మారి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు నిజజీవితంలో కూడా ఓ కొత్త ఫేజ్ లోకి ఎంటరవ్వాలని సందీప్ నిర్ణయించుకున్నాడు.

ఓ 2 రోజుల కిందట సందీప్ కిషన్ పెట్టిన పోస్ట్ కూడా ఈ అనుమానాలకు మరింత తావిస్తోంది. 2020 సంవత్సరం తన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు ఆలోచించుకునేలా చేసిందని, లైఫ్ లో మరో బిగ్ స్టెప్ వేయడానికి ధైర్యం ఇచ్చిందని చెప్పిన సందీప్.. రేపు ఆ ఎక్సయిటింగ్ న్యూస్ ను షేర్ చేస్తానంటూ ప్రకటించాడు. బహుశా రేపు సందీప్ తన పెళ్లి లేదా ప్రేమ మేటర్ ను బయటపెట్టే అవకాశం ఉందంటున్నారు.

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడిగా కొనసాగాడు సందీప్ కిషన్. పైగా ఏ హీరోపై లేనన్ని లింకప్ రూమర్స్ సందీప్ పై వచ్చాయి. హీరోయిన్లతో ఎఫైర్స్ అంటూ తనపై వచ్చిన రూమర్స్ ను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చిన ఈ హీరో… రేపు ఏం చెబుతాడో చూడాలి.

స్వర్ణ ప్యాలెస్.. మన వాళ్ళే