కొత్త హీరోతో చేయడానికి రెడీ – రాజమౌళి

ఒకప్పుడు మర్యాద రామన్న లాంటి చిన్న సినిమాలు చేశాడు రాజమౌళి. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి దర్శకుడయ్యాడు. మరి ఇలాంటి టైమ్ లో ఓ చిన్న సినిమా తీస్తాడా.. మరీ ముఖ్యంగా కొత్త హీరోతో సినిమా…

ఒకప్పుడు మర్యాద రామన్న లాంటి చిన్న సినిమాలు చేశాడు రాజమౌళి. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి దర్శకుడయ్యాడు. మరి ఇలాంటి టైమ్ లో ఓ చిన్న సినిమా తీస్తాడా.. మరీ ముఖ్యంగా కొత్త హీరోతో సినిమా చేస్తాడా?

అలాంటి అనుమానాలు పెట్టుకోవద్దంటున్నాడు రాజమౌళి. తన కథకు కొత్త హీరో అయితే బాగుంటాడనిపిస్తే, కొత్త హీరోతోనే సినిమా చేస్తానని, ఈ విషయంలో మరో ప్రశ్నకు తావులేదన్నాడు.

“కొత్త హీరోతో చేయకూడదని లేదు. కథను బట్టి హీరో ఎంపిక ఉంటుంది. కథకు కొత్త హీరో బాగుంటాడనుకుంటే కొత్త ఫేస్ నే తీసుకుంటా. కొత్త హీరోతో చేయకూడదు, చేస్తే రీచ్ ఉండదు, బడ్జెట్ పరిమితులుంటాయి లాంటి అంశాల్ని నేను పట్టించుకోను. నా స్క్రిప్ట్ కు కొత్త హీరో బాగుంటాడనిపిస్తేనే కొత్త ముఖాన్ని తీసుకుంటాను. కొత్త హీరోతో కూడా నన్ను నేను ప్రూవ్ చేసుకోగలను అని నిరూపించుకోవడం కోసం మాత్రం సినిమా చేయను.”

కొత్త హీరోతో సూపర్ డూపర్ హిట్లు కొట్టిన సినిమాలు చాలా ఉన్నాయని, కాబట్టి హీరో కొత్త-పాత అనేది తన కథ డిసైడ్ చేస్తుందని అన్నాడు రాజమౌళి.

ప్రస్తుతం ఈ దర్శకుడు, మహేష్ తో చేయబోయే మూవీ కోసం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ లో ఉన్నాడు. లెక్కప్రకారం ఈ ఏడాదిలోనే సినిమా స్టార్ట్ అవ్వాలి. కానీ వర్క్ షాప్ కోసం మరింత సమయం తీసుకుంటున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది. హైదరాబాద్ లో ఈ మూవీ కోసం భారీ సెట్ వేయబోతున్నారు.

One Reply to “కొత్త హీరోతో చేయడానికి రెడీ – రాజమౌళి”

Comments are closed.