భారతీయులకి సొంత దేశంలో ఎన్నికల పట్ల ఎటువంటి ఆసక్తి ఉంటుందో, ఆ రకమైన ఆసక్తి అమెరికా ఎన్నికల పట్ల కూడా ఉంటోంది కొన్ని వర్గాలకి. ఎందుకంటే కుటుంబానికి ఒకరో ఇద్దరో అమెరికాలో ఉంటున్నారు. అంతే కాదు, అమెరికా పాలనని బట్టి డాలర్ మారకం విలువ, దానిని అనుసరించి అమెరికా ఆధారిత సంపాదన ఉంటుంది కనుక ఎవరు ఎన్నికైతే పరిస్థితి ఏమిటా అని అంచనా వేసుకుంటూ ఉంటారు. ఇది ఇప్పుడనే కాదు..గత రెండు మూడు దఫాలుగా ఈ రకమైన ఆసక్తి భారతీయుల్లో పెరుగుతూనే ఉంది.
ఇప్పుడు మరొక కారణం కూడా ఉంది. కమల హారిస్ బరిలో ఉంది. ఆమె తల్లి భారతీయురాలు. అవతల ఉన్నది డోనల్డ్ ట్రంప్. అల్రెడీ అమెరికా అధ్యక్షుడిగా చేసాడు కనుక అందరికీ పరిచయమే. ఈ ఎన్నికల్లో కమల నెగ్గితే మొట్టమొదటి మహిళా అమెరికా అధ్యక్షురాలవుతుంది. అంతే కాదు, తొలి భారతదేశ నేపథ్యమున్న అమెరికా అధ్యక్షురాలిగా కూడా చరిత్రకెక్కుతుంది.
గెలుపు అవకాశాలు ఎవరికున్నాయి అనే దానికి ప్రాధమికంగా ఆయా పార్టీల పట్ల జనాల్లో సానుభూతి ఎవరి పట్ల ఉన్నది అనే దాని మీద లెక్కగడతారు. ఆపైన అభ్యర్థులిద్దరూ డిబేట్స్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తున్నారు అన్న దాని మీద కూడా వారి గెలుపోటములు ప్రభావితమవుతాయి.
తాజాగా ఫిలడెల్ఫియాలో మొదటి డిబేట్ జరిగింది. ట్రంప్ గురించి తెలిసిన వాళ్లకి, కమల గురించి పరిచయమున్నవాళ్లకి ఇద్దరి మధ్య యుద్ధం ఎలా ఉంటుందా అన్న ఆసక్తి కలిగింది.
వస్తూనే కమల చేయి చాపి ట్రంప్ తో కరచాలనం చేస్తూ, “లెటజ్ హేవ్ ఏ గుడ్ డిబేట్” అంది.
దానికి స్పందిస్తూ, “గుడ్ టు సీ యు. హేవ్ ఫన్” అన్నాడు ట్రంప్.
ఇక్కడ “హేవ్ ఫన్” అనడంలో ఆంతర్యమేమిటి? అది రొటీన్ గా ఫ్లోలో వచ్చిన మాటలా ఉన్నా .. “నీ సరదా తీరుస్తా చూడు” లాంటి అర్ధం వచ్చేలా ఉందని కొందరి ఉవాచ.
ఇలాంటి కౌంటర్లు, సెటైర్లు వేయడంలో ట్రంప్ దిట్ట.
అలాగే మరో సందర్భంలో, తన మాటకి కమల అడ్డుపడుతుంటే, “వెయిట్ ఏ మినిట్. నేను మాట్లాడుతున్నాను”, అని బదులిచ్చి, కాస్త ఆగి “ఎక్కడో విన్నట్టుగా ఉందా?” అని అడిగాడు.
2020 డిబేట్ లో తన రిపబ్లికన్ పార్టీకి చెందిన అప్పటి వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ తో సరిగ్గా ఇదే మాట అంది కమల హారిస్. నాలుగేళ్ల తర్వాత తన మాట తనకే అప్పజెప్పాడు. ఇలాంటి మెమరీ, సందర్భోచితంగా ప్రత్యర్ధిని దెబ్బ కొట్టడం ట్రంప్ స్టైల్.
ఇలాంటి మాటల గారడీలు పక్కన బెట్టి అసలు అమెరికా భవిష్యత్తు గురించి, పరిపాలన గురించి ఏమి మాట్లాడుతున్నారో చూస్తే పెద్దగా అయితే ఏమీ లేదు అనిపించింది.
ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద మాత్రం ట్రంప్ కువాఖ్యలు చేసాడు. వాళ్లు పిల్లుల్ని, కుక్కల్ని తిని బతుకున్నారని అన్నాడు. నిజానికి ఈ మాట మొదట అన్నది ఉపాధ్యక్ష పదవికి లైన్లో ఉన్న తన పార్టీ అభ్యర్థి జె.డి.వాన్స్. తర్వాత అతనే అది పుకారని చెప్పాడు. కానీ దానినే పట్టుకుని మాట్లాడి, తనకి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీదున్న అసహ్యాన్ని, కోపాన్ని వెళ్లగక్కాడు ట్రంప్.
ప్రధానంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద రిపబ్లికన్ పార్టీకున్న వ్యతిరేకత, డెమాక్రాట్స్ కూడా అరికడుతున్నామని చెప్పినా వారు సమర్ధవంతంగా అరికట్టలేరన్న భావన బయటపడింది ఈ డిబేట్లో. ప్రధానంగా ఈ ఎన్నికలో ఇది భూమిక కానుంది. అమెరికాలో నిరుద్యోగ సమస్యకి, ఇతర సామాజిక ఇబ్బందులకి, శుభ్రతకి, భద్రతకి ఈ వలసలు కారణమని భావిస్తున్నవారే ఎక్కువ. కనుక ఈ పాయింటులో ట్రంప్ కే మొగ్గు చూపే అవకాశముంది. ఈ విషయంలో కమల తన మాటలతో ట్రంప్ పై స్కోర్ చేయలేకపోయింది.
అలాగే, బైడెన్ వీక్నెస్ వల్లే ఉక్రైన్ యుద్ధం ఆపలేకపోయామని, “పేతటిక్ ఓల్డ్ మాన్” అని తన ఫిల్టర్ లేని తరహాలో వ్యక్తిగతంగా విమర్శించాడు ట్రంప్.
ఈ డిబేట్ కి కమలా హారిస్ బాగా ప్రిపేర్ అయి వచ్చినట్టు, ట్రంప్ తన సహజ ధోరణిలో మాట్లాడుతున్నట్టు కనపడింది.
ట్రంప్ మొత్తంగా సీరియస్ టోన్ లో నవ్వకుండా మాట్లాడుతుంటే, కమల మధ్యమధ్యలో నవ్వుతూ, ట్రంప్ ని లెక్కలేనట్టుగా చూస్తూ మాట్లాడింది. ఆమె తరహాలో సహజత్వం లోపించింది.
ఎలా చూసుకున్నా ట్రంప్ ని కార్నర్ చేసే ప్రయత్నాలు చేసినా కమల తన మాటలతో కబళించలేకపోయింది. ఇంతకీ, నువ్వు పవర్లోకి వస్తే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పై ఎటువంటి చర్యలు తీసుకోదలచుకున్నావు అని అడిగితే ట్రంప్ మాట్లాడలేదు.
స్థూలంగా చెప్పాలంటే తొలి డిబేట్ లో ట్రంప్ దే పైచేయి అన్నట్టుగా ఉంది. కమల సమర్ధవంతమైన నాయకురాలిగా నిలబడుతుందన్న నమ్మకానికి వన్నె తెచ్చేలాంటి మాటలు ఇంకా మాట్లాడలేదు. ట్రంప్ సైలి అర్థమయింది కనుక తర్వాతి డిబేట్స్ లోనైనా తన సత్తా చూపిస్తుందేమో చూడాలి.
ట్రంపుతో పద్ధతిగా మాట్లాడి నెగ్గడం కష్టం. అప్పట్లో హిల్లరీ క్లింటన్ కూడా అలాగే దెబ్బతింది. ట్రంప్ గీత దాటి మాట్లాడతాడు. దానిని ఎదుర్కోవాలంటే ప్రత్యర్ధి కూడా దాటాలి. ఇలాంటి సంభాషణకే జనం కనెక్ట్ అవుతున్నారు. పొగరుకి పొగరు, అసభ్యతకి అసభ్యత, కౌంటరుకి ప్రతి కౌంటరు వేస్తూ వెళ్తేనే ట్రంపుతో డిబేట్ యుద్ధం సాధ్యం. మరి కమల ఎలా నెగ్గుకొస్తుందో!
ఇంత చెప్పుకున్నా, జరిగింది ఏంటంటే..డిబేట్ అయిన వెంటనే సుప్రసిద్ధ గాయని టేలర్ స్విఫ్ట్ ఒక ట్వీట్ చేస్తూ తన మద్దతు కమల హారిస్ కే అని చెప్పింది. ఆమెకి దేశవ్యాప్తంగా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అంతే కాదు మీడియా చానల్స్ కూడా కమలదే పైచేయి అనే విధంగా చెప్పుకొచ్చాయి. ట్రంప్ వ్యతిరేకి అయిన సీ.ఎన్.ఎన్ చానల్లో కమల పైచేయి సాధించినట్టున్నా గట్టి పోటీ ఎదుర్కోనుంది అని చెప్పడం జరిగింది. అంటే ఇదంతా డెమాక్రాటిక్ పార్టీ వారి మీడియా, సోషల్ మీడియా కేంపైన్ గా అర్ధం చేసుకోవచ్చు. ఈ దెబ్బకి ట్రంప్ వ్యాపారాలకి సంబంధించిన స్టాక్స్ కూడా పడ్డాయి. అంటే కేంపైన్ ఫలితం చూపించినట్టే.
కనుక రానున్న డిబేట్స్ లో ట్రంప్ పై నెగ్గుకురావడం కమలకి ఎంతటి సవాలో, మీడియా ధాటిని తట్టుకుని ఎదురీదడం ట్రంప్ కి సవాలుగా మారేట్టు ఉంది. ఇద్దరి పోరు ఎలా సాగి ఎలా ముగుస్తుందో నవంబర్లో తేలుతుంది.
పద్మజ అవిర్నేని
Emundi eduru daadi burada jalludu. India lo ilantivi baagaa nadustayi endukante by and large public gorrelu kabatti. akkada chaduvukunna vallu ekkuva. choodali katha ento mari.
emundi burada jalludu tudusukonudu. India lo ante gorrelu kabatti ilantivi nadustayi. akkada janam ki same style ekkuddo ledo mari. Article write madam seems to be thatha fan. So for her thatha is the winner. For CNN and some other pundits madam ji is the winner. Telugu kallatho choosthe yes thatha will win hands down because that is how our politicians talk.
Article write madam seems to be thatha fan. So for her thatha is the winner. For cnn and some other pundits madam ji is the winner. Telugu kallatho choosthe yes thatha will win hands down because that is how our politicians talk.
Article write madam seems to be thatha fan.
Article write madam seems to be grandpa fan.
Article writer madam seems to be grandpa fan.
writer madam seems to be dadaji fan.
writer seems to be dadaji fan.
ఆఖరి వాక్యం అక్షర సత్యం. ఎలేచ్షన్స్ రోజు వరకు కమల దే విజయం అని వింటుంటాం, ఫలితాలు వచ్చాక గాని తెలియదు.
2016 లో ట్రంప్ అనూహ్యంగా గెలిచాడు. స్టాక్ మార్కెట్ పతనం అయింది, ఈసారి ట్రంప్ గెలిస్తే పాజిటివ్ గా ఉంటుంది.
నిన్న ట్రంప్ మీడియా షేర్స్ దిగజార్చడం వెనుక ఒకరకమైన భయం కలిగించడం కోసమే అనుకోవచ్చు. గెలిస్తే సగటు అమెరికన్ కి మేలు కలగొచ్చు. కానీ స్టాక్ మార్కెట్ అంత డీప్ స్టేట్ చేతిలోనే వుంది. వాళ్ళు కాళ్ళ బేరానికి వస్తారు.
పేరుకే ఆమె బ్రాహ్మణ ఇండియా మూలాలు అనే కానీ,
వాళ్ళు అంతా కరడు కట్టిన ద్రావిడ కమ్యూనిస్టు ముఠా.
హిందువులు అంటే మంట కమల కి.
వొంటే బిడ్డల అంటే ముద్దు.
నీ చెవిలో చెప్పిందా ?
చెవిలో చెప్పక్కర్లేదు, వైస్ ప్రెసిడెంట్ అయ్యే ముందు ఆవిడ కార్య కలాపాలు గమనిస్తే తెలుస్తుంది. జార్జ్ సోరోస్ ఫండ్స్ ఇచ్చాడు.
మోకాలికి బోడి గుండు కి లంకె వేసినట్టుంది.. ఏమి ఆధారాలు లేకుండా జార్జ్ సోరోస్ పేరు చెప్తే సరిపోతుందా ?
వైస్ ప్రెసిడెంట్ కాక ముందు ఆమె కాశ్మిర్ విషయం లో భారత్ కి వ్యతిరేకంగా మీటింగ్ లకి వెళ్ళేది. టీఎంసీ ఎంపీ, రాహుల్ గాంధీ, ఏచురి లాంటి వాళ్ళు లం*డన్ లో జార్జ్ సోరోస్ ఏదో మీటింగ్ పెడితే హాజరు అయ్యారు.
లంకె ఉంటె షేర్ చేయి బాబాయ్ నేను కూడా తెలుసుకుంటా..
లేకపోతే వాట్సాప్ యూనివర్సిటీ అని ఒప్పుకో
ఒకసారి అక్కడ స్థిరపడితే పిల్లలు అలాగే తయారవుతారు.. మనవారికి చాలా ఆత్మ న్యూనతా భావం జాస్తి…
ఆమె ఒక తెల్ల యూదుడుని పెళ్లి చేసుకుంది అంటే ఆమె చెప్పేవి చేసేవి వేరు అని అర్ధం.. బ్రాహ్మణులు యూదులు ఒకే మూలం అని చాలామంది భావన…
Trump is against deep state and media is controlled by them. What we listen and see may not reflect the pulse of the nation. Trump is very cautious as she is woman and minority race of color, at no point he shall appear attacking her as it is gonna backfire. He need to avoid or minimize his debates with her. Unless something big happen like covid during last elections, Trump may not be stopped to sit on elliptical office this time.
yes fear of losing start aindi Trump mowa lo.. asalu race woman valla edi back fire avvadu.. endukante nalla vallaki already Trump ante padadu.. aadavallaki elagu telusu manodi stree lani entha takkuva chesi matladado… aina mowa ki aadavallalo chala support undi tella valla side nunchi.. edemaina debate odipoyadani oppukodaniki istam leka ivoka silly covering reasons..
యూదులు వెలివేసిన నంబూద్రి లు మరియు స్వలింగ సంపర్కులు. మూలాధార చక్రాన్ని నమ్ముకున్న వాళ్ళు. వాళ్ళ డిఎన్ఏ కరెప్ట్ అయ్యి చాల కాలమయ్యింది. ఇంకా కమల భారతీయత కన్నా, నల్ల జాతీయురాలిగానే పెరిగి , పరిగణించబడింది. ఇప్పుడు ఇండియన్స్ ఓట్స్ కోసం దక్షిణ భారతం లో వున్నా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని వాడుకుని , ద్రావిడులని ఇన్ఫ్లుయెన్స్ చేసే పనిలో పడ్డారు. నార్త్ వాళ్ళు ఆల్రెడీ ట్రంప్ వైపు కి జరిగారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ సారి నల్లవాళ్ళ తరువాత ఇండియన్స్ తురుపు ముక్కలుగా మారడం కోసం మెరుపు.
యూ/ దులు వె/లివేసిన నంబూద్రి లు మరియు స్వలి0గ స0పర్కులు. మూలాధార చక్రాన్ని నమ్ముకున్న వాళ్ళు. వాళ్ళ డిఎన్ఏ క/రె/ప్ట్ అయ్యి చాల కాలమయ్యింది. ఇంకా క/ మల భారతీయత కన్నా, న/ ల్ల జాతీయురాలిగానే పెరిగి , పరిగణించబడింది. ఇప్పుడు ఇండియన్స్ ఓట్స్ కోసం దక్షిణ భారతం లో వున్న కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని వాడుకుని , ద్రావిడులని ఇన్ఫ్లుయెన్స్ చేసే పనిలో పడ్డారు. నార్త్ వాళ్ళు ఆల్రెడీ ట్ర0ప్ వైపు కి జరిగారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ సారి నల్లవాళ్ళ తరువాత ఇండియన్స్ తురుపు ముక్కలుగా మారడం కోసం మెరుపు.
Looks like GA is a fan of Trump, just watch comedy shows in USA like Dialy Show, Late night show, you will see how pathetic Trump did in debate. At no point in debate he was able to show any coherent thought.
Kamala was able bait him and pull nerve and show complete dominance.
చాల పక్షపాత ధోరణి తో ఉంది ఈ సమీక్ష
ట్రంప్ మద్దతు దారు అనుకుంటా..
అక్కడి ప్రసార మాధ్యమాలే కాదు స్వయానా రిపబ్లిక్ పార్టీ కి చెందిన వారు కూడా
ట్రంప్ తేలిపోయాడు అని ఒప్పుకున్నారు ఒప్పుకోడమే కాదు.. కమల హార్రీస్ ఏవో
ఇయర్ ఫోన్స్ వాడి చర్చ లో మోసం చేసింది అని వాపోతున్నారు
ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి ట్రంప్ మావ తేలిపోయాడనడానికి.. రచయితకి ఏ కోణం లో ట్రంప్ గెలిచినట్టన్పించాడో మరి..
enni debate lu poina parledu … americans ki gender pattimpu ekkuva .. okka sari kuda mahila president ledu radu
You have a valid point.
Even against hillary, she was ahead of Trump at that time. He got some emails of her leaked at the right time to pip her, Trump can do any thing to win, no matter what.
ఆయన ఆగర్భ శ్రీమంతుడు.. ఇలాంటి చర్చలకి పనికిరాడు.. ఆవిడ బాగా చదువుకున్న అటార్నీ జనరల్.. బాగా బలిసి వెనకేసిన దేశీలు ట్రంప్ వైపు ఉంటారు.. ఇతరులకి కమలనే మేలు…
ఆయన ఆగర్భ శ్రీమంతుడు.. ఇలాంటి చర్చలకి ప ని కి రా డు.. ఆవిడ బాగా చదువుకున్న అటార్నీ జనరల్.. బాగా బ లి సి వెనకేసిన దేశీలు ట్రంప్ వైపు ఉంటారు.. ఇతరులకి కమలనే మేలు…
ఈమెకు బొత్తిగా పరిజ్ఞానం లేనట్లుంది లేదా ఏపీ లో అన్నకి లాగా, అమెరికా లో ట్రంప్ ఫ్యాన్ అనుకుంట. biased రాతలు. ఫాక్స్ న్యూస్ లాంటి వాళ్లే కమల విన్నర్ అని రాస్తున్నారు.
అక్కడి మీడియా అంతా ట్రంప్ కి వ్యతిరేకం!
Meeru USA lol vuntunnara? Fox News is Republicans media
కేంద్ర మంత్రి గా పని చేసిన రాజీవ్ చంద్రశేఖర్ కి చెందిన ఆసియా నెట్ లో అన్నీ బీజేపీ వ్యతిరేక వార్తలు వస్తాయి, మోడీ గారి మిత్రుడిగా చెప్పే అంబానీ ల కి చెందిన మనీ కంట్రోల్ వెబ్మీడియా లో కూడా అంతే!
Ayana prakaram modi ki kuda media vyatirekam. Akkada Hindi English channels chuste modini netti meeda pettukuni mostaru.
vc estanu 9380537747