Advertisement

Advertisement


Home > Movies - Movie News

కత్రినా పెళ్లిలో ఖరీదైన విందు మెనూ

కత్రినా పెళ్లిలో ఖరీదైన విందు మెనూ

కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి వేడుక మొదలైంది. రాత్రి సంగీత్ లో ఇద్దరూ సందడి చేశారు. సూపర్ హిట్ బాలీవుడ్ సాంగ్స్ కు కలిసి డాన్స్ చేశారు. అంతకంటే ముందు, సంగీత్ వేదికపైకి రథంతో ఎంట్రీ ఇచ్చాడు విక్కీ కౌశల్. ఆ వెంటనే ఈజిప్ట్ యువరాణి థీమ్ తో కత్రినా కైఫ్ ఎంట్రీ ఇచ్చింది. ఇద్దరితో పాటు నేహాధూపియా లాంటి బాలీవుడ్ ప్రముఖులు సంగీత్ లో సందడి చేశారు. గాయకుడు గుర్ దాస్ మన్ షో, సంగీత్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మరికాసేపట్లో మెహందీ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. దీని కోసం ప్రత్యేకంగా 20 కిలోల మెహందీ పొడిని తెప్పించారు. అది కూడా సేంద్రియ పద్ధతిలో పండించిన మెహందీ కావడం విశేషం. కేవలం ఈ మెహందీ పొడి కోసమే లక్ష రూపాయలు వెచ్చించారు.

మెహందీ ఫంక్షన్ తర్వాత కత్రినా-విక్కీపై ప్రత్యేకంగా ఫొటో షూట్ నిర్వహించబోతున్నారు. దీని కోసం సిక్స్ సెన్సెస్ లో మరో ఫోర్ట్ ను ప్రత్యేకంగా అలంకరించారు.  రేపు అసలైన వివాహ వేడుక జరగనుంది. విక్కీ పుట్టి పెరిగింది ముంబయిలోనే అయినప్పటికీ, అతడిది పంజాబీ నేపథ్యం. కాబట్టి పెళ్లిని ముందుగా పంజాబీ సంప్రదాయంలో నిర్వహించనున్నారు.

పెళ్లికి వచ్చిన అతిథుల కోసం అన్ని రకాల వంటకాల్ని సిద్ధం చేసి పెట్టారు. రాజస్థానీ లోకల్ వంటకాలతో పాటు కాంటినెంటల్ స్పెషల్ వంటకాల్ని కూడా వండివార్చారు. కచోరీలు, దహీ భళా, ఫ్యూజన్ ఛాట్స్ కోసం ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటుచేశారు. పాన్, గోల్ గప్పాస్ కోసం కూడా ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటుచేశారు. రాజస్థానీ రకాలైన దాల్-బాటీ చుర్మాతో పాటు.. ఇండియాకు చెందిన అన్ని రకాల నాన్-వెజ్ వంటకాల్ని సిద్ధం చేశారు.

నిన్న రాత్రి నుంచి మొదలుపెట్టి, రేపటి రాత్రి వరకు ప్రతి పూట ఓ కొత్త తరహా మెనూను అందించబోతున్నారు. చివరికి యూరోపియన్, మెడిటేరియన్ వంటకాల్ని కూడా కత్రినా-విక్కీ పెళ్లిలో ప్రత్యేకంగా అందించబోతున్నారు. ఇవన్నీ ఒకెత్తు అయితే, రేపు వేడుకలోకి రాబోతున్న కేక్ మరో ఎత్తు. ఈ కేక్ ను తయారుచేసేందుకు ప్రత్యేకంగా ఇటలీ నుంచి చెఫ్ ను రప్పించారు. ఇండియాలో ఈ తరహా కేక్ ను తయారుచేసే చెఫ్ లు లేరంట. పెళ్లి వేడుక విందులో ఈ కేక్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

పెళ్లి వేడుకల కోసం ఇప్పటికే సెలబ్రిటీలంతా రిసార్ట్ కు చేరుకున్నారు. అందరూ రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. అంతా తమ ఫోన్లను తమకు కేటాయించిన గదుల్లో విడిచిపెట్టి వేడుకలకు హాజరవుతున్నారు. సల్మాన్ ఖాన్ వ్యక్తిగత భద్రత చూసే షెరా అనే వ్యక్తి, అతడి కంపెనీ ఈ పెళ్లి వేడుకలకు సెక్యూరిటీ అందిస్తోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?