ప్రముఖ తెలుగు రచయిత శ్రీరమణ కన్నుముశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని తన స్వగృహంలో ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. పేరడి రచనలకు పేరుగాంచిన ఆయన, బాపు, రమణలతో కలిసి పనిచేశారు.
శ్రీరమణ ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా, వేమూరు మండలం, వరహాపురం అగ్రహారంలో 1952 సెప్టెంబరు 21 న జన్మించారు. వేమూరులో ఫస్ట్ ఫారమ్ చేసిన ఆయన, అనంతరం బాపట్ల ఆర్ట్స్ కాలేజీలో పీయూసీ పూర్తిచేశారు. శ్రీకాలమ్, శ్రీచానెల్, చిలకల పందిరి, హాస్య జ్యోతి, మొగలిరేకులు వంటి శీర్షికలు ఆయన రచించారు.
నవ్య వార పత్రికకు ఎడిటర్‌గానూ ఆయన పనిచేశారు. తనికెళ్ల భరణి దర్శకత్వంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మీ ప్రధాన పాత్రల్లో 2012లో వచ్చిన మిథునం సినిమాకు కథ అందించింది శ్రీరమణనే. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.