సమంత చేస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ యాక్షన్ సినిమా యశోద. ఈ సినిమా పలు భాషల్లో భారీగా తయారవుతోంది. సినిమాలో కీలకమైన యాక్షన్ సన్నివేశాలు వున్నాయి. వీటి చిత్రీకరణకు హాలీవుడ్ యాక్షన్ స్పెషలిస్ట్ ను పిలిపించడం విశేషం. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్ యశోద చిత్రంలో సమంత యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేస్తున్నారు.
గతంలో సమంత నటించిన 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌కు యానిక్ బెన్ వర్క్ చేశారు. అందులో యాక్షన్ సీన్స్‌ను ఆయన డైరెక్షన్ చేశారు. సమంతతో 'యశోద' ఆయనకు సెకండ్ ప్రాజెక్ట్. హాలీవుడ్లో క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకు స్టంట్ పర్ఫార్మర్గా కూడా ఆయన వర్క్ చేశారు.
రీసెంట్గా హైదరాబాద్‌లో పది రోజుల పాటు 'యశోద' యాక్షన్ సీక్వెన్స్ తీశారు. ఇంకో యాక్షన్ సీక్వెన్స్ కొడైకెనాల్లో జరిగే షెడ్యూల్లో తీయాలని ప్లాన్ చేశారు. మూడు కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఆర్ట్ డైరెక్టర్ అశోక్ వేసిన సెట్స్‌లో షూటింగ్ చేస్తున్నారు.
హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్ నేతృత్వంలో తీసిన యాక్షన్ సీక్వెన్స్ గురించి శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ “సమంత తదితరులపై పది రోజుల పాటు మూడు సెట్స్‌లో షూటింగ్ చేశాం. సమంత కష్టపడి అద్భుతంగా యాక్షన్ సీన్స్ చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది” అని చెప్పారు.
వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి హరి, హరీష్ దర్శకులు.