యోగా చెక్కిన అద్భుత అంద‌గ‌త్తె శిల్పం

శిల్పాశెట్టి ప‌రిచ‌యం అక్క‌ర్లేని గుర్తింపున్న హీరోయిన్‌. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా త‌న‌దైన శైలిలో రాణించిన హీరోయిన్‌గా అభిమానుల మ‌నసుల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారామె. శిల్పాశెట్టి సీరియ‌స్ న‌టి అయిన‌ప్ప‌టికీ, రియ‌ల్ లైఫ్‌లో మాత్రం…

శిల్పాశెట్టి ప‌రిచ‌యం అక్క‌ర్లేని గుర్తింపున్న హీరోయిన్‌. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా త‌న‌దైన శైలిలో రాణించిన హీరోయిన్‌గా అభిమానుల మ‌నసుల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారామె. శిల్పాశెట్టి సీరియ‌స్ న‌టి అయిన‌ప్ప‌టికీ, రియ‌ల్ లైఫ్‌లో మాత్రం చాలా స‌ర‌దాగా ఉండ‌డం ఆమె ప్ర‌త్యేక‌త‌.

నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు టిక్‌టాక్ వీడియోల‌తో ర‌చ్చ‌ర‌చ్చ చేస్తూ…అభిమానుల‌కి కావాల్సినంత వినోదాన్ని పంచేవారామె. టిక్‌టాక్ యాప్‌ను మ‌న దేశం నిషేధించిన నేప‌థ్యంలో…ఆమె కొత్త దారి ఎంచుకున్నారు. యోగాస‌నాలు చేస్తూ…ఆ వీడియోల‌ను ఆమె షేర్ చేస్తూ అల‌రిస్తున్నారు. యోగాస‌నాలు వేయ‌డంలో త‌న నైపుణ్యం ఏ స్థాయిలో ఉందో…ఆమె వేసే భంగిమ‌లే చెబుతున్నాయి. న‌డుముని విల్లులా వంచుతూ శిల్పా యోగాస‌నాలు చేయ‌డం ప్ర‌తి ఒక్క‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో ఆమె షేర్ చేశారు. ఈ వ‌య‌స్సులో కూడా శిల్పాశెట్టి అంత ఈజీగా శ‌రీరాన్ని వంచుతూ యోగాస‌నాలు చేయ‌డాన్నిచూసిన  ఫ్యాన్స్ ఆశ్చ‌ర్యంతో పాటు ఆనందానికి లోన‌వుతున్నారు.  ఇంత ఫిట్‌నెస్ ఎక్క‌డి నుంచి వ‌చ్చిందంటూ ఆ వీడియోకి నెటిజ‌న్ల నుంచి కామెంట్స్ రావ‌డం విశేషం.  శిల్పాకు 1.73 కోట్లకి పైగా  ఫాలోవర్స్ ఉండ‌డం విశేషం.

నిమ్మ‌గ‌డ్డ క‌మ్మోడు కాబ‌ట్టే…ఉతికి ఆరేసిన పోసాని

ప్రభాస్ 2 కోట్ల విరాళం