కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగి బాబు పెళ్లి చేసుకున్నాడు. తమిళనాడులోని తిరుత్తనిలో యోగిబాబు, మంజు భార్గవిల వివాహం నిరాడంబరంగా జరిగింది. యోగిబాబు కుటుంబానికి ఇష్టదైవమైన మురుగన్ ఆలయంలో ఈరోజు ఉదయం పెళ్లిని సింపుల్ గా జరిపించారు.
పెళ్లికి కోలీవుడ్ ప్రముఖులు ఎవరూ హాజరుకాలేదు. కేవలం యోగిబాబు చిన్ననాటి స్నేహితులు, ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. చెన్నైలో వచ్చే నెలలో సినీప్రముఖులకు భారీ రిసెప్షన్ ప్లాన్ చేశాడు యోగిబాబు. అన్నట్టు ఇది లవ్ మ్యారేజీ కాదు, ఇంట్లో పెద్దలు కుదిర్చిన వివాహం.
పలు సినిమాలతో తెలుగులో కూడా పాపులర్ అయ్యాడు యోగిబాబు. మరీ ముఖ్యంగా నయనతార నటించిన కోకిల సినిమాలో యోగిబాబు సాంగ్ ఇక్కడ కూడా పాపులర్ అయింది. రీసెంట్ గా వచ్చిన దర్బార్ లో కూడా యోగిబాబు ఉన్నాడు. ప్రస్తుతం అతడు కమెడియన్ స్థాయిని దాటి, లీడ్ రోల్ పాత్రలు పోషిస్తూ కామెడీ సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు.