క్యాపిటల్ అమరావతి కోసం పోరాడుతున్నామని ఓ వైపు చంద్రబాబు డప్పుకొట్టుకుంటున్నారు. గత రెండు నెలలుగా ఆయన ఏపీలోని పదమూడు జిల్లలాను పక్కన పెట్టి మరీ కేవలం అక్కడి 29 గ్రామాలకే పరిమితం అయ్యారు.
అమరావతితోనే అంతా అన్నట్లుగా ఎల్లో మీడియా ఆర్భాటం మరో వైపు. ఏదో జరిగిపోతోందన్న భ్రాంతిని ప్రపంచానికి చాటాలన్న ఆరాటం మరో వైపు. ఇలా బాబు అండ్ కో ఎంత గొంతు చించుకున్నా స్పందన నిల్. దాంతో బాబు ఇపుడు శాపనార్ధాలకు సైతం దిగుతున్నారు.
వైసీపీ నేతలపై మరింత దిగజారి వ్యక్తిగత దూషణలకూ పాల్పడుతున్నారు. ఇదిలా ఉండగానే రాజధానుల ఏర్పాటు అంశం రాష్ట్రపరిధిలోనిది అని కేంద్రం మరో వైపు ప్రకటించేసింది. దాంతో బాబు మీద వైసీపీ నేతలు ఇపుడు కౌంటర్ అటాక్ చేస్తున్నారు.
క్యాపిటల్ కోసం ఉద్యమం అంటూ బయల్దేరిన బాబు చివరికి క్యాపిటలిస్టుల పోరాటానికి నాయకత్వం వహిస్తున్నారంటూ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గుడివాడ అమరనాధ్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు.
అమరావతిలో పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం బాబు పోరాడుతూ, పేద రైతులు అని దానికి అంటూ కలరింగ్ ఇస్తున్నారని ఆయన గట్టిగానే తగులుకున్నారు. అయిదేళ్ల పాటు ఏపీని సర్వనాశనం చేసిన చరిత్ర బాబుది అని ఆయన అంటున్నారు.
అక్షరాలా రెండున్నర లక్షల కోట్ల అప్పును ఏపీకి మిగిల్చి కాడె వదిలేసిన బాబు ఇపుడు తగుదునమ్మా అంటూ అమరావతి పేరిట శోకాలు పెట్టడం దేనికని ఆయన ప్రశ్నించారు.
బాబు అయిదేళ్ల పాలనలో మిగిలిన ప్రాంతాలు దారుణంగా దెబ్బతిన్నాయని, వాటిని సరిచేసేందుకు అధికార వికేంద్రీకరణ అవసరమని గుడివాడ అంటున్నారు. విశాఖలో రాజధాని పెడతామంటే బాబుకు ఎందుకంత కక్ష అని ఆయన నిలదీశారు.
విశాఖను వదిలేసుకున్నారా, టీడీపీకి అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు. కేంద్రం చెప్పిన మాటలను విని అయినా బాబు మారాలని ఆయన కోరారు. మొత్తం మీద గుడివాడ మాటలతో బాబుని చెడుగుడు ఆడేసుకున్నారు.
గూగుల్లో ఎంత సెర్చ్ చేసినా ఒక్క అమ్మాయితో కూడా లింకప్ రావట్లేదు