ఇక కుర్ర హీరోలు ఆ దర్శకుడికి దూరం?

స్కంద సినిమా తీసిన బోయపాటి, తన బలహీనతను తానే బయటపెట్టుకున్నట్టయింది. బాలయ్య లాంటి పెద్ద హీరోతో తప్పితే, కుర్రహీరోలతో తను సినిమాలు తీయలేనని మరోసారి నిరూపించుకున్నాడు ఈ దర్శకుడు. దీంతో యంగ్ హీరోస్ అంతా…

స్కంద సినిమా తీసిన బోయపాటి, తన బలహీనతను తానే బయటపెట్టుకున్నట్టయింది. బాలయ్య లాంటి పెద్ద హీరోతో తప్పితే, కుర్రహీరోలతో తను సినిమాలు తీయలేనని మరోసారి నిరూపించుకున్నాడు ఈ దర్శకుడు. దీంతో యంగ్ హీరోస్ అంతా బోయపాటితో సినిమా అనగానే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునే పరిస్థితి.

తులసి, సింహా, అఖండ, లెజెండ్.. ఇలా బోయపాటి హిట్ కొట్టిన సినిమాల్లో సీనియర్ హీరోలే ఎక్కువ. ఒక్క సరైనోడు సినిమా మాత్రమే దీనికి మినహాయింపు.

యంగ్ హీరోస్ విషయానికొస్తే.. రామ్ చరణ్ కు వినయ విధేయరామ రూపంలో అతిపెద్ద డిజాస్టర్ ఇచ్చాడు. ఈ సినిమా దెబ్బకి, రామ్ చరణ్, తన ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. అంతకంటే ముందు ఎన్టీఆర్ కు దమ్ము రూపంలో పెద్ద ఫ్లాప్ ఇచ్చాడు. మధ్యలో బెల్లంకొండ ఉండనే ఉన్నాడు. ఇక రీసెంట్ గా ఈ లిస్ట్ లోకి రామ్ కూడా చేరాడు.

స్కంద సినిమా పరాజయం పరిపూర్ణమైంది. రామ్ కు మరో ఫ్లాప్ వచ్చిందనే చర్చ కంటే, కుర్ర హీరోల్ని ఈ మాస్ డైరక్టర్ హ్యాండిల్ చేయలేడనే టాక్ బాగా వ్యాపించింది. దీంతో బోయపాటికి సగానికి సగం అవకాశాలు తగ్గినట్టయింది.

ప్రస్తుతానికైతే స్కంద ఫ్లాప్ తో బోయపాటి కాస్త ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. ఆయన స్కంద-2 తీయడనేది పక్కా. ఇంతకుముందు ప్రకటించినట్టు అఖండ-2తో బోయపాటి తననుతాను మరోసారి నిరూపించుకుంటే బెటర్.