యంగ్ టీమ్ వర్క్ చావు కబురు చల్లగా

గీతా 2 పతాకంపైగా బన్నీవాస్ నిర్మిస్తున్న సినిమా చావు కబురు చల్లగా. ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని విడుదల దిశగా వెళ్తోంది. ఈ సందర్భంగా యూనిట్ మొత్తం మీడియాతో తమ అనుభవాల్ని…

గీతా 2 పతాకంపైగా బన్నీవాస్ నిర్మిస్తున్న సినిమా చావు కబురు చల్లగా. ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని విడుదల దిశగా వెళ్తోంది. ఈ సందర్భంగా యూనిట్ మొత్తం మీడియాతో తమ అనుభవాల్ని పంచుకుంది. హీరో కార్తికేయ, హీరోయిన్ లావణ్య త్రిపాఠి, దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి, నిర్మాత బన్నీవాస్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

డైరెక్టర్ కౌశిక్ మాట్లాడుతూ ఈ సినిమా కథకు తగినట్లు చావు కబురు చల్లగా అనే టైటిల్ ను లాక్ చెయ్యడం జరిగింది. హీరో డెడ్ బాడీస్ ను పికప్ చేసుకొనే వెహికల్ డ్రైవర్ గా హీరోయిన్ నర్స్ గా కనిపిస్తుంది. ఇదొక లవ్ స్టొరీ, సీరియస్ పాయింట్ ను వినోదాత్మకంగా చెప్పడం జరిగింది. సినిమాలో అన్ని పాటలు బాగా వచ్చాయి. ఆడియన్స్ కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉన్నాయని తెలిపారు.

నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ కథ పరంగా మంచి సినిమా చెయ్యాలని అనుకుంటున్న సమయంలో కౌశిక్ చెప్పిన కథ నచ్చి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. ఫ్రెష్ కంటెంట్ తో కౌశిక్ చెప్పిన ఈ పాయింట్ మిస్ అవ్వకూడదని ఈ సినిమా చేశాను. ఎడిటింగ్ రూమ్ లో సినిమా చూసిన తరువాత చాలా హ్యాపీగా అనిపించింది. అనుకున్నది అనుకున్నట్లుగా తీశారు. కార్తికేయ, లావణ్య ఇద్దరూ ఈ కథకు పూర్తి న్యాయం చేశారు. యంగ్ టీమ్ చేసిన ఈ సినిమా అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.

హీరోయిన్ లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ ఈ కథ విన్నప్పుడు చాలా నచ్చింది. గీతా ఆర్ట్స్ లో మళ్లీ సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. థాంక్స్ టు బన్నీ వాసు . ఈ సినిమాలో ఎమోషన్స్ బాగుంటాయి, అందరూ కనెక్ట్ అవుతారని అన్నారు.

హీరో కార్తికేయ మాట్లాడుతూ చాలా గ్యాప్ తరువాత ఇలా మీడియాతో మాట్లాడడం సంతోషంగా ఉంది. ఈ సినిమా గురించి అందరూ బాగా మాట్లాడుకుంటున్నారు. ఒక పాజిటీవ్ వైబ్రేషన్స్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ కథకు నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు బన్నీ వాసు కు ధన్యవాదాలు. షూటింగ్ సమయంలో అల్లు అరవింద్ గారు బాగా సపోర్ట్ చేశారు. డైరెక్టర్ చెప్పింది నేను చేశాను, తాను క్లారిటీతో సినిమా తీసాడు. ఒక మంచి సినిమాలో నటించానన్న సంతృప్తి ఉందని తెలిపారు.

టీడీపీ ముచ్చట తీరింది

దేశం మౌనం పాటిస్తోంది