వైఎస్ జగన్ ను కలవనున్న దిల్ రాజు!

టాలీవుడ్ కింగ్ పిన్ దిల్ రాజు ఫుల్ హ్యాపీగా వున్నారు. ఆయన ఇప్పుడు టాలీవుడ్ హయ్యస్ట్ పవర్డ్ బాడీకి అధ్యక్షుడు. అంటే టాలీవుడ్ లో అన్ని సెక్టార్లు కలిసి ఆయనను ఎన్నుకున్నాయి. దీని వెనుక…

టాలీవుడ్ కింగ్ పిన్ దిల్ రాజు ఫుల్ హ్యాపీగా వున్నారు. ఆయన ఇప్పుడు టాలీవుడ్ హయ్యస్ట్ పవర్డ్ బాడీకి అధ్యక్షుడు. అంటే టాలీవుడ్ లో అన్ని సెక్టార్లు కలిసి ఆయనను ఎన్నుకున్నాయి. దీని వెనుక చాలా ఎక్సర్ సైజ్ జరిగింది. 

అల్లు అరవింద్ లాంటి పెద్దలు చక్రం తిప్పారు. ఇంకా చాలా.. చాలా.. చాలా మంది కృషి వుంది. అంత మంది సహకారం పొందడం అన్నది దిల్ రాజు ప్లానింగ్ కు నిదర్శనం. ఇప్పుడు ఈ జోష్ లోనే ఇండస్ట్రీ జనాలకు భారీ పార్టీ కూడా ఇచ్చేసారు దిల్ రాజు. మరి తరువాత ఏంటీ?

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసే పనిలో వున్నారు దిల్ రాజు అని తెలుస్తోంది. ఆంధ్ర సిఎమ్ జగన్ అపాయింట్ మెంట్ ఇప్పటికే కోరినట్లు తెలుస్తోంది. వన్స్ అపాయింట్ మెంట్ ఫిక్స్ అయితే వెళ్లి కలిసి, ఆంధ్ర ప్రభుత్వం నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీ ఏం కోరుకుంటోందో చెప్పి, సానుకూల వార్తలతో వెనక్కు రావాలని అనుకుంటున్నారు.

టికెట్ ల సమస్య తరువాత టాలీవుడ్ జనాలు ఎవ్వరూ ఆంధ్ర సిఎమ్ ను కలవలేదు. ఇప్పుడు దిల్ రాజు వెళ్లడం కచ్చితంగా ఇంట్రస్టింగ్ గా వుంటుంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ సమస్యలు ఏవి వున్నా, ఆంధ్ర సిఎమ్ సానుకూలంగా స్పందించే అవకాశం వుంది.