Advertisement

Advertisement


Home > Movies - Photo Feature

పెద్దోడు అభయ్ రామ్.. చిన్నోడు భార్గవ్ రామ్

పెద్దోడు అభయ్ రామ్.. చిన్నోడు భార్గవ్ రామ్

ఎన్టీఆర్-ప్రణతి దంపతులకు రీసెంట్ గా కొడుకు పుట్టిన విషయం తెలిసిందే. వాడికి ఈరోజు పేరు పెట్టారు. తన చిన్నోడి పేరును ఎన్టీఆర్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేశాడు. వీడే భార్గవ రామ్ అంటూ సకుటుంబ సమేతంగా ఓ అందమైన ఫొటోను విడుదల చేశాడు. ఎన్టీఆర్ పెద్ద కొడుకు పేరు అభయ్ రామ్. 

సంప్రదాయ దుస్తుల్లో ఎన్టీఆర్, అభయ్ రామ్, ప్రణతి.. బ్యాక్ డ్రాప్ లో పండగ వాతావరణం, మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ ముఖంలో ఆనందం.. ఇవన్నీ ఈ ఫొటోను కలర్ ఫుల్ గా మార్చేశాయి. చిన్నకొడుక్కి కూడా భార్గవ రామ్ అనే పేరు పెట్టి, రామ్ అనే సెంటిమెంట్ ను నందమూరి ఫ్యామిలీ ఇలా మరోసారి కంటిన్యూ చేశాడు ఎన్టీఆర్.

ప్రస్తుతం ఈ హీరో త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు కొన్ని రోజుల పాటు బ్రేక్ ఇచ్చారు. ఈ బ్రేక్ లో పూజా హెగ్జే, మహేష్ బాబు సినిమాతో బిజీ అయిపోతే, ఎన్టీఆర్ ఇలా ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతున్నాడు. కొడుకు పుట్టిన తర్వాత ఎన్టీఆర్ దిగిన ఫస్ట్ ఫ్యామిలీ ఫొటో ఇది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?